ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
ధనుష్ నటించిన సార్ మూవీ ఘన విజయాన్ని సాధించింది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాషల్లోనూ కలెక్షన్లతో దుమ్ము లేపుతుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, హైపర్ ఆది కూడా నటించారు. హైపర్ ఆది అంటే పంచులకు లోటు ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ కామెడీ ఉంటుంది. తన పంచులతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడతారు. ఇదే విషయంపై ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ హైపర్ ఆదిని ఆకాశానికి ఎత్తేశారు. సార్ మూవీ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ నారాయణ మూర్తి సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ తీరును ఎండగడుతూ తీసిన సార్ మూవీ తనకు బాగా నచ్చిందని అన్నారు.
అయితే ఈ సినిమాలో హైపర్ ఆది కామెడీకి తాను ఎంతగానో నవ్వుకున్నానని అన్నారు. అందరి గురించి మాట్లాడిన ఆయన.. హైపర్ ఆది గురించి మాట్లాడడం మర్చిపోయారు. దీంతో వెంటనే గుర్తు తెచ్చుకుని స్టేజ్ మీదే క్షమాపణలు చెబుతూ.. హైపెర్ ఆదిని ముందుకు పిలిచి తన పక్కన నిలబెట్టుకున్నారు. పాతతరం హాస్యనటులైన రేలంగి, రాజబాబు వంటి హాస్యనటులతో పోల్చి హైపర్ ఆదిని ఆకాశానికి ఎత్తేశారు. నవ్వకుండా నవ్వించడం కష్టమయ్యా.. నీకు దండం అంటూ హైపర్ ఆదికి దండం పెట్టారు. అయితే హైపర్ ఆది గురించి మాట్లాడే ముందు యాంకర్ పై ఆర్ నారాయణ మూర్తి సీరియస్ అయ్యారు.
ఈ సక్సెస్ మీట్ వేడుకకి స్రవంతి చొక్కారపు యాంకరింగ్ చేసింది. అయితే అందరి గురించి మాట్లాడిన నారాయణమూర్తి హైపర్ ఆది గురించి మాట్లాడడం మర్చిపోవడంతో.. హైపర్ ఆది గురించి మాట్లాడబోయారు. అయితే ఆ విషయాన్ని గ్రహించని యాంకర్.. వేరే వాళ్ళని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో ఎప్పుడూ కోప్పడని నారాయణమూర్తి యాంకర్ పై ఫైర్ అయ్యారు. ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’ అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ లేనిది నారాయాణమూర్తి ఇలా సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.