నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ బుధవారం రిలీజైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది.
ఇది కూడా చదవండి: హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! కారణం..?
2 నిమిషాల నిడివి ఉన్న టీజర్.. సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ప్రతిదానికి ముహుర్తం, జాతకాలు అనే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు సుందరంగా నాని.. మోడర్న్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన యువతి లీలాగా నజ్రియా కనిపించనున్నారు. ఇక వీరిద్దరి మధ్య మొదలైన లవ్ ట్రాక్.. ఇరు కుటుంబాల్లో తెలియడం, ఆ తర్వాత ఏంటనే ఆసక్తితో కథను నడిపించినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. మొత్తానికి నాని మరోసారి క్యూట్, అండ్ రోమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి సుందారనికి వచ్చే ఇబ్బందులు, వాటిని ఎలా దాటాడో తెలియాలంటే జూన్ 10 వరకు ఆగాల్సిందే. సినిమా టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నా మ్యూజిక్ హీరో నానికి నచ్చలేదు! తమన్ సంచలన కామెంట్స్!