హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! కారణం..?

Allu Arjun sadi Sorry to Nani

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ వార్ ఎక్కువగా ఉండేది. హీరోలందరూ పోటీ పడుతూ.., ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు ఉండేవారు. కానీ.., గత కొంత కాలంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. భారీ మల్టీ స్టారర్లు తెరకెక్కడం మొదలయ్యాయి. స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. సీనియర్ హీరోలను గౌరవించుకుంటూ, యువ హీరోలను ప్రోత్సహిస్తూ, తమలో తాము సహకరించుకుంటూ నేటి తరం స్టార్ హీరోలు ఇలా ముందకు వెళ్లడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంలో ఎప్పుడు ముందుంటారు. పరిశ్రమలో ఏ సినిమా హిట్టైనా.. ఆ మూవీ యూనిట్ కి ముందుగా ఫోన్ వెళ్ళేది బన్నీ నుండే. అందుకే ఐకాన్ స్టార్ అందరివాడు అయిపోయారు. ఇక పుష్పతో పాన్ ఇండియా హిట్ అందుకున్న బన్నీ.. తాజాగా హీరో నానికి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Allu Arjun sadi Sorry to Nani

రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన బన్నీ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. “సినిమా అంటే అందరిది. అందరి సినిమాలు బాగా ఆడాలి. అఖండ, పుష్ప మంచి విజయాలను సాధించాయి. శ్యామ్ సింగరాయ్ కూడా బాగా ఆడింది. కానీ.., ఈ సినిమా గురించి మాట్లాడేందుకు నాకు సరైన సమయం దొరకలేదు. ఇందుకే నానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను” అంటూ బన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యుండి, తన తోటి హీరో మూవీని అడ్రెస్ చేయలేదని బన్నీ క్షమాపణలు కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత గొప్పగా ఆలోచించబట్టే అల్లు అర్జున్ ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. హీరో నానికి ఐకాన్ స్టార్ బన్నీ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.