అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎగిరి గెంతులేస్తారు. అట్టాంటిది హీరోయిన్ గా అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా? కానీ బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ మాత్రం చేయను అని ఖచ్చితంగా చెప్పేసిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఆ హీరోయిన్ ప్రస్తుతం చిచ్చరపిడుగులా ముందుకు దూసుకు వెళ్తున్న హీరోయిన్ .పైగా ఆ హీరోయిన్ అచ్చ తెలుగు పదహారణాల తెలుగు అమ్మాయి. తనని చూస్తుంటేనే తెలుగు తనం ఉట్టి పడుతుంది. లేటెస్ట్ గా వచ్చిన ఒక మూవీలోని తన నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ మూవీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ అవ్వడమే కాదు తెలుగు సినీ పరిశ్రమకి ఇన్నాళ్ళకి మంచి హీరోయిన్ దొరికందని అందరూ అనుకునేలా చేసింది. తాజాగా ఆ నటి చెప్పిన ఒక మాట తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుంది. ఒక పెద్ద హీరోతో సినిమా చెయ్యనని చెప్పానని స్వయంగా ఆమె ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
బలగం సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా లో హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకి ఎప్పటినుంచో తెలుసు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా గంగోత్రిలో కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా నటించి అందరి అభిమానాన్ని చూరగొంది. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో బాల నటిగా నటించినా కూడా ప్రేక్షకులందరి దృష్టిలో గంగోత్రి కావ్య గానే గుర్తుండిపోయింది. 2022లో వచ్చిన హారర్ చిత్రం మసూదతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన బలగం మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కావ్య రూపంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ దొరికిందని సినీ ప్రేక్షకులతో పాటు సినీ పండితులు కూడా భావించారు.
యూనివర్సల్ స్టార్ అల్లు అర్జున్ కి భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా కాకపోయినా జస్ట్ అల్లు అర్జున్ సినిమాలో క్యారెక్టర్ వస్తే చాలు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటాం అని కూడా చాలా మంది భావిస్తారు. కానీ కావ్య కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ తో సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కి గురిచేసింది.
అసలు ఏం జరిగిందంటే గంగోత్రి సినిమా షూటింగ్ టైంలో అల్లు అర్జున్ తన సినిమాలో బాలనటిగా చేస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ తో నువ్వు పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా చేస్తావా అని అడిగితే నేను పెద్దయ్యాక మీ పక్కన హీరోయిన్ గా చేయను ఎందుకంటే నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు ముసలివాళ్ళు అయిపోతారని కావ్య అల్లు అర్జున్ తో అంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కావ్య కళ్యాణ్ రామ్ ఈ ఫన్నీ విషయాన్ని బయట పెట్టింది. గంగోత్రి షూటింగ్ టైంలో తనకు, అల్లు అర్జున్ కి మధ్య ఈ సరదా సంభాషణ జరిగిందని.. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా తన సత్తా చూపుతున్నారని కూడా చెప్పింది. ఏమో సినిమా పరిశ్రమలో ఏమైనా జరగవచ్చు. భవిష్యత్తులో అల్లు అర్జున్, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా సినిమా రావచ్చేమో.