ఆమె ఒక అందాల నటి. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె తన సొంత మాతృభాష అయిన మలయాళ చిత్ర సీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఈ మధ్యనే ఇండియన్ సినిమా గర్వించదగ్గే ఒక గొప్ప దర్శకుడి సినిమాలో కూడా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ఆమె తెలుగు అగ్రహీరో మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆమె ఒక అందాల నటి. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె తన సొంత మాతృభాష అయిన మలయాళ చిత్ర సీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఈ మధ్యనే ఇండియన్ సినిమా గర్వించదగ్గే ఒక గొప్ప దర్శకుడి సినిమాలో కూడా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ఆమె తెలుగు అగ్రహీరో మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమని శాసిస్తున్న అతికొద్ది మంది దక్షిణ భారతదేశ నటులలో అల్లు అర్జున్ ఒకడు. నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తన సత్తాని ఇండియన్ బాక్స్ ఆఫీస్ సినిమాకి రుచి చూపిస్తున్నాడు ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.
పుష్ప సినిమాతో ప్రారంభించిన జైత్రయాత్ర ని పుష్ప 2 తో కంటిన్యూ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అల్లు అర్జున్ స్టైల్ మిగతా హీరోల కంటే భిన్నంగా ఉంటుంది. అల్లు అర్జున్ స్టైల్ ని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అలా ఫాలో అయ్యే వాళ్ళల్లో అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఉంటారు. ఐశ్వర్య లక్ష్మి.. .మలయాళ చిత్ర రంగానికి చెందిన ఈ ముద్దు గుమ్మ తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యింది. ఆ సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర వేసి అందరి నోట ఐశ్వర్య లక్ష్మి మంచి నటి అని అనుకునేలా చేసింది. ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వం రెండు భాగాల్లోను ఐశ్వర్య నటించింది.
ఆ సినిమాల్లో తన పాత్ర మేరకు ఐశ్వర్య లక్ష్మి బాగా నటించిందని సినీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. అసలు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం సంపాందించిందంటే ఐశ్వర్యలో వున్న నటన ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంక అసలు విషయానికి వస్తే ఐశ్వర్య లక్ష్మి తాజాగా అల్లు అర్జున్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ కి ఉన్న ఎంతో మంది అభిమానుల్లో నేను కూడా ఒకదాన్నని.. ఆయన స్టైల్, డ్రెస్ సెన్స్, యాక్టింగ్ చేసే విధానం సూపర్ గా ఉంటాయని చెప్పింది. పైగా ఆయన స్టైల్ ని మా లాంటి ఆర్టిస్ట్ లు కూడా ఫాలో అవుతారని.. తానైతే పక్కా అల్లు అర్జున్ ఫ్యాన్ ని అని ఘంటా పథంగా నొక్కి మరి ఐశ్వర్య లక్ష్మి చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.