ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప2 ది రూల్'. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.
ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబోలో హిట్ పడితే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే.. మరి అదే హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే అభిమానుల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా పాన్ ఇండియా అభిమానులు ఎదురు చూస్తున్న సీక్వెల్ మూవీ ఏదన్నా ఉంది అంటే సమాధానం పుష్ప2 అనే వస్తుంది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేశాడు సుకుమార్. ఆ నిరీక్షణకు తెరదించుతూ తాజాగా పుష్ప ఎక్కడ అంటూ పుష్ప2 కు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ ను బన్నీ బర్త్ డే కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ లు షేక్ కావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘పుష్ప2 ది రూల్’. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగానే సుకుమార్ పుష్ప2ను తీర్చిదిద్దినట్లు తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో తెలుస్తోంది. ఇక టీజర్ విజయానికి వస్తే.. పుష్ప ఎక్కడ? ఇదే సినిమాకు కీ పాయింట్ గా మేకర్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప రాజ్ కు ఎనిమిది బుల్లెట్ గాయాలు తగిలినట్లుగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా చూపించాడు. ఇక పుష్ప అరెస్ట్ తో ఆ ఊరు ప్రజలు మెుత్తం విధ్వంసం సృష్టించారు. బుల్లెట్ గాయాలు తగిలిన పుష్ప బతికే ఉన్నట్లు చివరికి చూపించాడు సుకుమార్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ను మరోలెవల్ కు తీసుకెళ్లిందనే చెప్పాలి.
ఇక చివర్లో చెప్పిన ఒక్క డైలాగ్ సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయి అంటే.. పులి వచ్చిందని అర్ధం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే.. పుష్ప వచ్చాడని అర్దం.. అనే డైలాగ్ కు థియేటర్లు షేక్ కావడం పక్కా. అయితే ఈ 3 నిమిషాల 17 సెకన్ల వీడియోలో శ్రీవల్లి కానీ, పుష్ప తల్లి గానీ, విలన్స్ ను గానీ చూపించకపోవడం గమనార్హం. అయితే పుష్ప ఎక్కడ? అనే కాన్సెప్ట్ నే సేలింగ్ కాన్సెప్ట్ గా సుకుమార్ తీసుకున్నాడు అని క్లియర్ గా తెలుస్తోంది. గతంలో డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాలో.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే కాన్సెప్ట్ ను సేలింగ్ పాయింట్ గా తీసుకుని భారీ విజయం సాధించాడు. తాజాగా ఇదే కోవలో సుకుమార్ వేర్ ఈజ్ పుష్ప అంటూ టీజర్ ను వదిలాడు. మరి ఈసారి కూడా పుష్ప తగ్గేదే లే అన్నట్లుగా ఉంది పుష్ఫ2 టీజర్. మరి ఈ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.