తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప2 ది రూల్'. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో.. డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ప్రభాస్ స్థాయి ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు పుట్టుకొచ్చారు. దాంతో ప్రభాస్ రేంజ్కూడా పెరిగింది. ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తనతో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్ని భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్ నటించిన […]
ఒకప్పుడు హీరోయిన్లు ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. తర్వాత అవకాశాలు వస్తాయో రావో అని ఆలోచించి.. కొన్ని రకాల పాత్రలకు ఓకే చెప్పేవారు కాదు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు ఏం చేయడానికి అయినా రెడీ అంటున్నారు. ఆఖరికి నగ్నంగా కనిపించడానికి కూడా వెనకాడటం లేదు. గతంలో ‘ఆమె’ సినిమాలో అమలా పాల్ ఇలా ప్రయోగం చేయగా.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఈ జాబితాలో […]
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ బుధవారం రిలీజైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది. ఇది కూడా చదవండి: హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! […]
తెలుగు చిత్ర ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి పాటలు, టీజర్ లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు […]
స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]