నా మ్యూజిక్ హీరో నానికి నచ్చలేదు! తమన్ సంచలన కామెంట్స్!

తెలుగునాట ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. ముందుగా ఎస్.ఎస్. తమన్ పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు సైతం తమన్ ట్యూన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక మాస్ మూవీస్ కి తమన్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంటుంది. వంద మిలియన్ వ్యూస్ సాంగ్స్ కి కేరాఫ్ అయిన ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఎవరు వదులుకుంటారు? ఇందుకే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి ఫస్ట్ ఛాయస్ తమన్ మాత్రమే. అయితే., నేచురల్ స్టార్ నానికి మాత్రం తమన్ మ్యూజిక్ నచ్చలేదట. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టడం విశేషం.

తమన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవన్నీ పెద్ద సినిమాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే తమన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. మీరు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా? ఎప్పుడైనా మీ చేతుల్లోకి వచ్చిన సినిమా.. మీ చేజారి వెళ్లిపోయిందా అన్న ప్రశ్నకు తమన్ సమాధానం ఇచ్చాడు.

Thaman Talking about Nani - Suman TV“హీరో నాని యాక్ట్ చేసిన టక్ జగదీశ్ మూవీకి ముందుగా నేనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాకి నేను ముందుగా బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాను. కానీ.., చేసినమ్యూజిక్ హీరో నానికి నచ్చలేదు. దాంతో.. ఆ మూవీ నా చేజారింది. నా లైఫ్ లో ఇలా జరగడం ఫస్ట్ టైమ్. ఆ సమయంలో కాస్త బాధపడ్డాను. కానీ.. క్రియేటివ్ ఫీల్డ్ లో ఇలాంటి సంఘటనలు మాములే. ఇప్పుడు మరోసారి నాని సినిమాకి పని చేసే అవకాశం వస్తే తప్పక చేస్తానని తమన్ చెప్పుకొచ్చాడు. ​ప్రస్తుతం తమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొన్ని నెలల క్రితం ఓటీటీలో విడుదలైన టక్ జగదీశ్ ఆశించిన మేర ఆకట్టుకోలేదు. మరి.. తమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.