అభిమాన క్రికెటర్లను కలవడం సామాన్యులకి ఒక కల. కానీ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న ఎస్.ఎస్ థమన్ కూడా ఒక క్రికెటర్ ని కలవడం తన కల అని చెబుతున్నాడు. అంతేకాదు ఆ క్రికెటర్ తనకి దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు.
“ఎస్.ఎస్ థమన్” ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో సంచలనంగా మారాడు. ఏ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఆ సినిమా బంపర్ హిట్ అవ్వడం గ్యారంటీ. ఆరోతరగతి వరకే చదువుకున్న థమన్.. సంగీతం మీద ఆసక్తితో సినిమా రంగానికి వచ్చి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతేకాదు ఎంతో మంది సింగర్లకు, సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. జీవితంలో ఎన్నో సాధించిన థమన్ ఇప్పుడు ఒక విషయంలో ఆనదంతో ఎగిరి గంతులేస్తున్నాడు. దీనికి కారణమేంటని పరిశీలిస్తే.. థమన్ తన ఫేవరేట్ క్రికెటర్ ని కలవడమే అని తెలుస్తుంది. మరి ఇంతకు థమన్ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు ?
థమన్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య జరిగిన సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ చూపించిన హుషారుకి వావ్ అనాల్సిందే. బౌలింగ్ , బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో లావుగా ఉన్నప్పటికీ చురుకుగా కదులుతూ అందరిని తనవైపుకు తిప్పుకున్నాడు. అంతే కాదు ఐపీఎల్ లో సన్ రైజర్స్ మ్యాచులకు కనిపిస్తూ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా థమన్ తన క్రికెట్ దేవుడిని చూశాడని చెప్పుకొచ్చాడు. ఆ దేవుడు ఎవరో కాదు టీం ఇండియన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని కావడం విశేషం. తన ఆట తీరుతో, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న ధోని.. థమన్ కి కూడా ఆరాధ్య క్రికెటర్ కావడం గమనార్హం.
ఇటీవలే తమిళనాడు సీఎంని కలిసిన ధోని.. అదే పనిలో థమన్నీ కూడా కలిసేసాడు. దీంతో అమితానందంతో థమన్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. థమన్ ట్వీట్ చేస్తూ.. “నా వాడు. న క్రికెట్ దేవుడు. మా ఎంఎస్ ధోనిని కలవడంతో నా కళ నెరవేరింది. నా హృదయం ఆనందంతో గంతులేస్తుంది. థాంక్యూ మై డియర్ ఎంఎస్ ధోని. బిలియన్ల కొద్ది ఉన్న నీ అభిమానుల్లో నన్ను హ్యాపీ చేసినందుకు.సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి గారి వల్లే ఇది సాధ్యమైంది” అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. మరి థమన్ ఫేవరేట్ క్రికెటర్ ధోని కావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
MY MAN
MY CRICKET GOD 🔥💣
OUR @msdhoniIt’s A dream Coming Really True
Heart is jumping in Joy 🤩Thanks dearest #MSDhoni U Made One Of Your Millions & Billions of Truest Fans Happy 🔥♥️
Thanks to Our Honourable Respected
Cheif Minister Sir @mkstalin and Minister Dear… pic.twitter.com/fFxI6RXeqx— thaman S (@MusicThaman) May 8, 2023