తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంలోనూ తన మార్క్ కనపడేలా జాగ్రత్త వహిస్తాడు సుకుమార్. ఇక ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే సుకుమార్ ది అందరి డైరెక్టర్ ల కంటే కొంచెం వెరైటీ స్టైల్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సుకుమార్ టైటిల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తాడు. అదీకాక టైటిల్ లోనే సినిమా కథను కూడా నిగూఢంగా చెబుతాడు. కాకపోతే దాన్ని మనం అర్ధం చేసుకోలేము అంతే. ఈ విషయం మీకు పుష్ప, పుష్ప2 టైటిల్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఇక తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
పుష్ప2 టీజర్ ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే దాదాపు రెండు మిలియన్ల వ్యూస్ సాధించింది ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ టీజర్ తో అభిమానుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నను లేవనెత్తాడు డైరెక్టర్ సుకుమార్. జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ? ఫ్యాన్స్ ను ఆలోచనలో పడేశాడు సుకుమార్. అయితే మీరు టీజర్ లో గమనించని విషయం ఏంటంటే? టైటిల్ డిజైన్ లోనే పుష్పరాజ్ ఎక్కడున్నాడు. కథ ఏ ప్రాంతంలో జరగబోతుంది అన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పకనే చెప్పాడు. అవును మీరు ఈ విషయాన్ని కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మీకే అర్ధం అవుతుంది. పుష్ప ది రైజ్ టైటిల్ డిజైన్ లో కథ దేని గురించో ముందే చెప్పాడు.
ఇక మీరు సరిగ్గా గమనిస్తే.. పుష్ప పార్ట్ వన్ టైటిల్ అంతా ఎర్ర చందనం దుంగలతో ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే కథ మెుత్తం ఎర్రచందనం చూట్టే తిరిగింది. ఇక తాజాగా పుష్ప2 టైటిల్ విషయానికి వస్తే.. పుష్ప పేరులో ఉన్న ఎర్ర చెందనం దుంగలను అలాగే ఉంచి నెంబర్ 2లో మాత్రం చైనాకి సంబంధించిన డిజైన్స్ ను చూపించాడు సుకుమార్. దాంతో ఈ కథ జరగబోయేది చైనాలో అని అర్ధం అవుతోంది. టీజర్ లో చూపినట్లుగా పుష్పరాజ్ జపాన్ లోనో, మలేషియాలో లేడు. అతడు చైనాలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అదీకాక ఈ టీజర్ లో అల్లు అర్జున్ కనిపించింది ఒకే ఒక్క షర్ట్ మీద అది కూడా చైనా మోడల్ చొక్కానే కావడంతో ఈ కథ చైనాలో జరగబోతుంది అని గట్టిగా చెప్పొచ్చు.
ఈ క్రమంలోనే ఇందుకు బలమైన కారణం కూడా ఇంకోటి ఉంది. అదేంటంటే? పుష్ప ది రైజ్ ను చైనాలో రిలీజ్ చేసి.. భారీ మెుత్తంలో ప్రమోషన్స్ చేశాడు సుకుమార్. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో మాత్రం సినిమా ఆడలేదు. దాంతో ఈసారి ఎలాగైనా చైనాలో రికార్డులు బద్దలు కొట్టాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే కథను చైనాకు లింక్ చేసినట్లు తెలుస్తోంది. మరి పుష్ప2 కథకు చైనాకు సంబంధం ఉన్న విషయాన్ని, టైటిల్ డిజైన్ లోనే కథను చెప్పిన విషయాన్ని మీలో ఎంత మంది కనిపెట్టారో కింద కామెంట్స్ చేయండి.