క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఆ తర్వాత జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉంటూనే నూతన దర్శకుడు శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు. ఇక ప్రస్తుతం శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేసారు. ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు.
దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన రవితేజ ఇప్పుడు ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో మొప్పించనున్నాడన్న మాట.