రావణాసుర సినిమాకి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ సొంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు మాస్ మహరాజ్ మరో హిట్టు కొట్టాడంటూ సందడి చేస్తున్నారు. అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు పెద్ద కారణమే ఉంది.
మాస్ మహరాజ్ నుంచి సినిమా వస్తోందంటే.. తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటుంది. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రవితేజ– సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన రావణాసుర సినిమా విడుదలైంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్, రెస్పాన్స్ వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కూడా సినిమా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే నెట్టింట రవితేజ ఫ్యాన్స్ హంగామా ప్రారంభించేశారు. మాస్ హిట్టు కొట్టాడంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారు. రావణాసుర సినిమా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే రవితేజ సినిమా హిట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు అంత హ్యాపీగా ఫీలవుతున్నారు? ఈ ప్రశ్న మీకు కూడా కలగచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి. అది కూడా సుధీర్ వర్మ – ప్రభాస్ కి ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు కాబట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ క్షణం మాత్రం థియేటర్ మొత్తం గోలగోల, రచ్చరచ్చే. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జయరాం ఓ రౌడీ ఇంటికి వెళ్లిన సందర్భంలో ప్రభాస్ ప్రస్తావన వస్తుంది. లండన్ మేడమ్ టుస్సాడ్స్ లో మా అన్న విగ్రహం పెడతాను అన్నారంటూ డైలాగ్ ఉంటుంది. అప్పుడు జయరాం.. “మేడమ్ టుస్సాడ్స్ లో మీ అన్న విగ్రహం పెట్టడానికి ఏమైనా విరాట్ కోహ్లీనా, ప్రభాసా?” అంటూ ప్రశ్నిస్తాడు.
ఆ ఒక్క మాటతో థియేటర్ మొత్తం గొల్లు మంటుంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. సుధీర్ వర్మ- రవితేజకు హిట్టు పడినట్లే. రొటీన్ రివేంజ్ స్టోరీని సుధీర్ వర్మ ఎంతో కొత్తగా చెప్పుకొచ్చాడు. సినిమా నిండా ట్విస్టులు, ఎలివేషన్స్ తో ఆకట్టుకున్నాడు. రవితేజ కూడా వన్ మ్యాన్ షో చేశాడు. ఎన్నో పాత్రలు వచ్చిపోతున్నా అందరి చూపు మాత్రం రవితేజ మాత్రమే ఉంటుంది. రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తోడవడంతో నెట్టింట రవితేజ రావణాసుర సినిమా గురించి తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే రెండు తెలగు రాష్ట్రాల్లో రావణాసుర సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రావణాసుర మూవీలో ప్రభాస్ ప్రస్తావనపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.