తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో భారీ చిత్రాలు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటుగా.. విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘తెగింపు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ జరుపుకోగా.. తాజాగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య కూడా ఈ రోజు జనవరి (28)న వరంగల్ లో సక్సెస్ మీట్ జరుపుకోబోతోంది. ఇక రిలీజ్ అయ్యి రెండు వారాలు కావొస్తున్నాగానీ కలెక్షన్ల సునామీ కొనసాగిస్తూనే ఉన్నాడు మెగాస్టార్.
‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రుతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ నిర్మించారు. విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్ తో దూసుకెళ్లింది వాల్తేరు వీరయ్య సినిమా. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాపై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. రిలీజ్ అయిన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన మెగాస్టార్.. 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించాడు. విడుదలై రెండు వారాలు అవుతున్నా గానీ కలెక్షన్ల సునామీ ఏ మాత్రం తగ్గడం లేదు. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ గా రూ. 130 కోట్లను కొల్లగొట్టాడు. దాంతో దాదాపు రూ. 41 కోట్ల భారీ లాభాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా వాల్తేరు వీరయ్య సాధించిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టోటల్ వరల్డ్ వైడ్ గా 130. 87 కోట్ల షేర్ ను రాబట్టింది వాల్తేరు వీరయ్య. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. మెగాస్టార్ లోని కామెడీ యాంగిల్ కు మరో సారి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ హీరో రవితేజ కూడా తన మార్క్ యాక్షన్ తో సినిమాలో కీలక పాత్ర పోషించాడు. శనివారం (జనవరి 28)న వరంగల్ వేదికగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటుగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఇక ఈ వారం కూడా ఇదే ఊపును మెగాస్టార్ కొనసాగిస్తే.. మరిన్ని కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రెండు వారాలు అవుతున్నా గానీ మెగాస్టార్ మాస్ కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MEGASTAR × MASS MAHARAJA × MEGA POWER STAR = 🤯❤️🔥🎊🎉 #WaltairVeerayya‘s వీరయ్య విజయ విహారం Grand Celebrations begin today 6 PM onwards 💥🔥
Stay tuned.@KChiruTweets @RaviTeja_offl @AlwaysRamCharan @dirbobby @ThisIsDSP pic.twitter.com/69UH0ytlLb
— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023