రావణాసుర సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజను ఎంతో కొత్త క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుధీర్ వర్మ కథ చెప్పిన తీరు అందరికీ ఆకట్టుకుంటోంది. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
మాస్ మహరాజ్ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన రావణాసుర సినిమా తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రవితేజ ఊరమాస్ యాక్షన్ తో ఇరగదీశాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి రెండు గంటలసేపు అసలు రవితేజ హీరోనా? విలనా? మంచోడా? చెడ్డోడా? అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి. ఇప్పటివరకు రవితేజను ఈ షేడ్స్ లో అస్సలు చూసుండరు. సదరు ప్రేక్షకుడు రావణాసురలో రవితేజ క్యారెక్టర్ డిజైన్ చూసి భయపడిపోతారు. ఇంక సుధీర్ వర్మ స్టోరీ టెల్లింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రొటీన్ రివేంజ్ స్టోరీని ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
రావణాసుర సినిమాకి మంచి పాటిజివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని ఒక బెంగాలీ సినిమాతో పోలుస్తున్నారు. 2019 ఏప్రిల్ లో విడుదలైన విన్ సిడా అనే సినిమాతో పోలిక చేస్తున్నారు. ఈ సినిమాలో రెండు పాత్రలు ఉంటాయి. ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి, మరొకరు మంచి టాలెంట్ ఉన్న మేకప్ ఆర్టిస్ట్. ప్రోస్తటిక్స్ తో ఒక ఫొటో చూసి వారిలా మాస్క్ రెడీ చేయగలడు. ఈ మేకప్ ఆర్టిస్ట్ ని అడ్డుపెట్టుకుని ఆది బోస్ అనే పాత్ర హత్యలు చేస్తుంటుంది. ఆ విషయం తెలుసుకుని ఎలాగైనా అతని చెర నుంచి బయటపడాలని మేకప్ ఆర్టిస్ట్ చివరికి అతడిని హత్య చేస్తాడు. ఈ కథనే సుధీర్ వర్మ రావణాసురగా తెరకెక్కించాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ కథ నుంచి సుధీర్ వర్మ కేవలం సోల్ మాత్రమే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందులో మెయిన్ పాయింట్ తీసుకుని సుధీర్ వర్మ ఒక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించాడు. రవితేజలాంటి యాక్టర్ తో యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రను డిజైన్ చేసి సుధీర్ వర్మ చెప్పిన కథ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ కథను కాపీ అని ప్రాచారాలు చేయడంలో ఎలాంటి అర్థం లేదని అభిమానులు, ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. రావణాసురలో రవితేజ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు తనదైనశైలిలో సినిమాని రక్తి కట్టించాడు. పాటల్లో అయితే రవితేజ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు.