శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలు అన్న తర్వాత డైలాగులు ఉండటం పరిపాటి. మూకీపోయి, టాకీ వచ్చిన తర్వాత సినిమాల్లో డైలాగులకు ప్రాధాన్యత పెరిగింది. కేవలం డైలాగులతో సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రేక్షకులు కూడా డైలాగులు నచ్చి సినిమాలకు వెళ్లిన సంద్భరాలు కూడా ఉన్నాయి. అయితే, కొన్ని సినిమాల్లో డైలాగులు శృతి మించుతున్నాయి. అశ్లీలతకు పెద్ద పీట వేస్తున్నాయి. అంతేకాదు! ఓ లింగాన్నో.. వర్గాన్నో కించపరిచేలా డైలాగులు ఉంటున్నాయి. శుక్రవారం విడుదలైన ‘రావణాసుర’ సినిమాలోని డైలాగులే ఇందుకు తాజా ఉదాహరణ.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే వివదాల్లో నిలిచింది. గత మార్చి నెలలో విడుదలైన ట్రైలర్‌లో సీతమ్మ వారి గురించి ఓ డైలాగ్ అభ్యంతరకంగా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ‘ సీతను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటాలి’ అన్న డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ సీతమ్మ వారిని తక్కువ చేసే విధంగా ఉండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సినిమా విడుదల నేపథ్యంలో ‘రావణాసుర’కు సంబంధించిన ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలోని డైలాగ్ ఆడవారిని కించపరిచే విధంగా ఉందంటూ నెటిజన్లు మండిపతున్నారు. స్వయంగా చిత్ర హీరో ఈ డైలాగ్ చెప్పటాన్ని తప్పుబడుతున్నారు. ‘కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది రా’ అంటూ ఓ యువతిని రవితేజ బెదిరిస్తూ ఉంటాడు. ఆడవాళ్లు కేవలం ఆ రెండు కోసమేనా అంటూ వీడియో చూసిన కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డైలాగ్ రాసింది రైటర్ అయినా.. దాన్ని ఆమోదించింది దర్శకుడు అయినా.. హీరో దానిపై కొంచెమైనా విజ్ఞత కలిగి ఉండాలని హితవు పలుకుతున్నారు. దర్శకుడికి, రైటర్‌కు, ఆఖరికి సినిమా హీరో రవితేజకు కూడా స్త్రీలంటే గౌవరం లేదని అంటున్నారు.
‘‘ఆడవాళ్లంటే కంచం, మంచమేనా? మాస్ రాజా.. ఇదేమి పైత్యం?’’ అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వైరల్‌గా మారిన కంచం, మంచం డైలాగ్‌తో పాటు చాలా అశ్లీల డైలాగులకు సెన్సార్ బోర్డు కోతలు పెట్టింది. సినిమా హాళ్ల ప్రింట్‌లో ఈ డైలాగ్‌లు లేకపోవటం మంచిదైంది. ఏది ఏమైనప్పటికి సినిమా వాళ్లు ప్రమోషన్స్ కోసం ఇలా ఆడవాళ్లను కించపర్చటం మంచిది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి, రావణాసురలోని అశ్లీల డైలాగులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A leaked clip from #Ravanasura tells the reason for the film getting an ‘A’ certificate. pic.twitter.com/iTY38u4OzE
— Aakashavaani (@TheAakashavaani) April 6, 2023