Kiraak RP: జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో ఒకరు కిరాక్ ఆర్పీ. తాను చేసిన జబర్దస్త్ స్కిట్స్ ద్వారానే బుల్లితెర ప్రేక్షకులను దగ్గరయ్యాడు. దాదాపు నాలుగు వందలకు పైగా స్కిట్స్ చేసిన ఆర్పీ.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారిగా అన్ని షోలకు దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అడపాదడపా పలు టీవీ షోలలో కనిపించినా.. చివరికి పెళ్లి వార్తతో బయటికి వచ్చాడు.
ఇటీవలే బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఆర్పీ.. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. అదీగాక ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలతోనే మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది కిరాక్ ఆర్పీ జంట. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ చేసుకోబోయే అమ్మాయి ఫోటోలు చూసి ఎవరు ఈ అమ్మాయి? ఇంతందంగా ఉంది. ఆర్పీతో లవ్ లో ఎలా పడింది? అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్.
ఇక కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ కి నాగబాబుతో పాటు నిహారిక, జబర్దస్త్ కమెడియన్లు, సన్నిహితంగా ఉన్న మరికొందరు హాజరయ్యారు. ఇక త్వరలోనే ఈ కిరాక్ ఆర్పీ జంట మంచి ముహూర్తపు రోజున పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ త్వరలో దర్శకుడిగా డెబ్యూ మూవీ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా కిరాక్ ఆర్పీ, తాను పెళ్లి చేసుకునే అమ్మాయి లక్ష్మీప్రసన్న ఇద్దరూ కూడా మొదటిసారి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని వారి లవ్ స్టోరీని షేర్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం లక్ష్మీప్రసన్న మాటలు విన్నారు ప్రేక్షకులు. ఇన్నిరోజులు కిరాక్ ఆర్పీ పక్కనే ఫోటోలలో కనిపించిన లక్ష్మీప్రసన్న.. ఎలా మాట్లాడుతుంది? అనే ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేశారు. ఇక తమ లవ్ స్టోరీ గురించి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ.. “,మాది వైజాగ్. హైదరాబాద్ లో సివిల్ కోర్స్ చేసేటప్పుడు కిరాక్ ఆర్పీ మా ఇన్స్టిట్యూట్ కి గెస్ట్ గా వచ్చి నన్ను చూసాడు. మొదటిసారి చూసినప్పుడే నన్ను ఇష్టపడుతున్నానని చెప్పి నా నెంబర్ అడిగితే.. నేను మా అమ్మ నెంబర్ ఇచ్చాను.
ఆ తర్వాత తను మెల్లగా మా అమ్మతో మాట్లాడుతూ ఆమె దగ్గర మంచి మనిషి అనిపించుకున్నాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు నాతో మాట్లాడకుండా మా అమ్మతోనే మాట్లాడుతుండేవాడు. ఆ వన్ ఇయర్ మేము మాట్లాడుకోలేదు. కొద్దిరోజులకు మా అమ్మకు విషయం చెబితే.. సినిమాల్లో తిరుగుతాడని ఒప్పుకోలేదు. కానీ.. నాకోసం మా బంధువులకు దగ్గరై, ఆ తర్వాత వాళ్ళచేత మా అమ్మను ఒప్పించి.. నిశ్చితార్థం చేసుకున్నాడు. మా అమ్మ ఒప్పుకునేసరికి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ, లక్ష్మి ప్రసన్నల ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి వీరి లవ్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.