సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు తమ బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్తున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ జరుపుకోగా మరో యువ నటుడు సాయి సుశాంత్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు.
టాలీవుడ్ లో ఓ ఇంటివాడు కాబోతున్న మరో నటడు. ఇటీవల హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వరుసలో మరో నటుడు వచ్చి చేరాడు. ఈ నగరానికి ఏమైంది? సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. తన నటనతో మెప్పించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాడు. ఆ సినిమాలో నటించిన నటుడే సాయి సుశాంత్ రెడ్డి. తాజాగా తను ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమా యూత్ ను ఆకట్టుకుంది. 2018 లో విడదలైన ఈ సినిమా హిట్ టాక్ తో మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, తదితర నటులు నటించి నటులుగా సక్సెస్ అయ్యారు. కాగా ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు సాయి సుశాంత్ రెడ్డి. ఈ సినిమాలో అతడు చేసిన రోల్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకోగా మళ్లీ అదే తేదీ 29 జూన్ 2023 న రీ రిలీజ్ చేశారు. ఇదే కాక బంబాట్, థ్యాంక్యూ సినిమాలో సుశాంత్ రెడ్డి నటించారు. అయితే నటుడు సాయి సుశాంత్ రెడ్డి తాజాగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటొలో తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి రింగ్ తొడిగాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్, ఇతర నటీనటులు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
smol crack in my heart 🥺
— 🤡🌶️ (@beforeishutup) July 4, 2023