దక్షిణాది చిత్ర పరిశ్రమలో KGF సినిమా రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలై అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మండమైన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఊహించని విజయాన్ని సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 ని కూడా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 గురువారం విడుదలయ్యింది. ఈ సినిమాకు క్రేజ్ ఎలా ఉందంటే.. ఫస్ట్ డే ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: మందు తాగుతాను.. ఆ టైంలోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్
ప్రీమియర్ షో, ట్విట్టర్ రివ్యూల్లో కేజీఎఫ్ చాప్టర్ 2 బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి పోటీగా మరే సినిమా లేకపోవడం.. కేజీఎఫ్‌కు కలిసి వచ్చే అంశం కానుంది. అయితే ప్రీమియర్ షో ద్వారా కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: బాలీవుడ్ ఎంట్రీపై యష్ క్లారిటీ! సూపర్ పంచ్
ఈ ఫోటోలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ అని ఉంది. ఈ ఫోటో సినిమా ఎండ్ కార్డ్స్‌లో వస్తుంది. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 వస్తుందనేది అర్థమవుతోంది. అయితే KGF చాప్టర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 3పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ‘సార్ కేజీఎఫ్ 3 కూడా రానుందా?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘ఏమో చూడాలి.. ఛాప్టర్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది’ అంటూ బదులిచ్చారు. ఈ కామెంట్ తోనే కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోతో అది కన్ఫమ్ అయ్యింది అంటున్నారు రాకీ భాయ్ అభిమానులు. కానీ కేజీఎఫ్ మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KGFChapter1 🔥🔥🔥🔥#KGFChapter2 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Finally. Waiting For #KGFChapter3 🔥💥💥#YashBOSS𓃵 pic.twitter.com/dhZOUZX16w— Kʀɪsʜɴᴀ 🅡︎🅒︎45 (@AlwaysKrishna45) April 14, 2022
ఇది కూడా చదవండి: తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పిన KGF డైరెక్టర్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.