కన్నడ ఇండస్ట్రీలో చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చి కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడు యష్. ప్రస్తుతం యష్ హీరోగానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నటుడు యష్. కన్నడ హీరో అయినప్పటికీ ‘కేజీఎఫ్’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తెలుగు ప్రేక్షకులు యష్ ని బాగా అభిమానిస్తున్నారు. నటుడిగానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కేజీఎఫ్ మూవీ తర్వాత యష్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తాజాగా యష్ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి వస్తే.. రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ కి ఎదిగిపోతారు. కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో 2004 లో ‘ఉత్తరాయణ’ అనే టీవీ సీరియల్ తో కెరార్ ప్రారంభించాడు. ఆ తర్వాత నందా గోకుల, ప్రితి ఇల్లాడ మేలే, శివలలో వంటి సీరియల్స్ లో నటించాడు. సింగర్ గా కూడా తన సత్తా చాటాడు. 2007 లో జంబాడా హుడుగి మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా రాని స్టార్ డమ్.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ మూవీతో ఏకంగా పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగాడు. కేజీఎఫ్ -2 మూవీతో ఆ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో యష్ పై ఫోకస్ చేస్తున్నాయి.
కన్నడ హీరో అయినప్పటికీ తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించాడు యష్. తాజాగా ఓ ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనగోలు చేశాడు యష్. దీని ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం. భారతీయ మార్కెట్లో బడా వ్యాపారులు, సినీ తారలు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఇది అత్యాధునిక ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.. గొప్ప లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. అందుకే సెలబ్రెటీలు ఈ కారు కొనేందుకు ఇష్టపడుతుంటారు. యష్ వద్ద ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్, మెర్సిడెస్ జీఎల్సి 250 డి కూపే లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.. తాజాగా ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd
— Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023