ఎంత కష్టపడి పనిచేసినా అదృష్టం ఆవ గింజంత అయినా ఉండాలని అంటారు పెద్దలు. ఎందుకంటే అదృష్టం.. ఒక్క రోజులోనే జీవితాన్ని మార్చేయగలదు. నిరుపేదను సైతం ధనవంతుడ్ని చేయగలదు. అదృష్టం ఒక్కసారి తలుపు తడితే.. దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి విషయంలో అదృష్టమే తలుపు తడుతూనే ఉంది.
ఎవరికైనా వరుసగా మంచి జరుగుతున్నా, అనుకున్నది సాధించినా, డబ్బులు అనుకోకుండా వచ్చినా అరే నక్కతోక తొక్కినట్లు ఉన్నారంటారు. వారు ఏదీ పట్టుకున్నా బంగారమౌతుందని, అదృష్టవంతులంటూ ముద్రవేస్తారు. అలాంటి అదృష్టం మనకు రావట్లేదని అనుకుంటూ చింతిస్తా ఉంటారు. తమకు అలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలని కోరకుంటారు. ఒకే రోజులో జాక్ పాట్ కొట్టాలని, అదృష్టవంతులమైపోవాలన్న ఆశలతో లాటరీ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెడతాం. అయితే లాటరీ రూపంలో లక్ష్మీ దేవి.. ఎప్పుడో ఏ ఒక్కరికో ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుంది. కానీ ఈ వ్యక్తికి మాత్రం పదేపదే కొడుతుంది.
అతడే ప్రవాస భారతీయుడు సుమన్ ముత్తయ్య నాడార్ రాఘవన్. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఖతార్ లో నివసించే ఇతగాడు రెండు నెలల క్రితం బిగ్ టికెట్ ఎలక్ట్రానిక్స్ డ్రాలో ఓ కిలో గోల్డ్ గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో బహుమతిని పొందాడు. సుమన్ స్నేహితుల సలహా మేరకు ఏడాదిన్నర కాలంగా అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లో పాల్గొంటున్నాడు. క్రితం ఏడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్‌లో ఓ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ టికెట్‌కు ఏకంగా కిలో బంగారం గెలుచుకున్నాడు. ఇటీవల మరో లాటరీ టికెట్ ను కొనుగోలు చేయగా.. మరో బంఫర్ ఫ్రైజ్ తగిలింది. ఏకంగా రేంజ్ రోవర్ కారును లభించింది.
రెండు నెలల వ్యవధిలోనే రెండు జాక్ పాట్‌లు కొట్టడంపై సుమన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు. భవిష్యత్తులో కూడా బిగ్ టికెట్ రాఫెల్‌లో పాల్గొంటానని చెప్పారు. ఓ వ్యక్తికి రెండు సార్లు జాక్ పాట్ లు కొడుతుంటే అదృష్టమనే చెప్పాలి. అదృష్టం అంటే నీదే సామి అనిపించకమానదు. అయితే లక్కీ అనేది ఒక్కసారి డబ్బులను కుమ్మరిస్తుందేమో కానీ, ప్రతిసారీ కాదూ. అలాగే ఎంత కష్టపడినా అదృష్టం ఆవ గింజంత అయినా ఉండాలని అంటారు పెద్దలు. ఈ సామెత ఇతడి విషయంలో నిజమనిపించ మానదు. మీకు ఎప్పుడైనా ఇలా బంఫర్ పైజ్ కొట్టిన అనుభవాలు ఉంటే.. కామెంట్ చేయండి.