వీవీఐపీలు తిరిగే కార్ల విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి వాహనాలనే ప్రధాని మోదీ కాన్వాయ్ లో వాడుతున్నారు. నలుపు రంగులో ఉండే రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ కార్లను ప్రధాని కాన్వాయ్ లో ప్రస్తుతం వాడుతున్నారు. నిజానికి ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ అనేది ఆల్ టెర్రైన్ వాహనం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నడిచేలా.. ఆన్ రోడ్లు, ఆఫ్ రోడ్ల మీద, తడి, పొడి, మంచుతో కూడిన పరిస్థితుల్లో ప్రయాణించే విధంగా దీన్ని తయారు చేశారు. 10.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. మరి అత్యంత పగడ్బందీగా, భారీ భద్రత నడుమ తయారు చేసిన ఈ కారు ఫీచర్లు? దీని ధర ఎంత ఉంటుంది వంటి విషయాలు మీ కోసం.
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ కంపెనీ తయారు చేసిన కారే ఈ ‘రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ’. పటిష్టమైన భద్రత, రక్షణను అందించడం కోసం ప్రత్యేకంగా ఈ ఎస్‌యూవీని రూపొందిస్తారు. రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ ప్రత్యేకతలు గురించి చెప్పాలంటే.. ఇది ఆల్ టెర్రైన్ వాహనంగా రూపొంచబడింది. ఏ రహదారిపై అయినా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చాకచక్యంగా నడుస్తుంది. ఈ వాహనం గంటకు 193 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 10.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. టన్ను కంటే ఎక్కువ బరువు గల ఆర్మర్ ప్లేట్ మరియు గ్లాస్ తో కూడిన బాడీతో ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ వేగంగా ప్రయాణించగలదు.
1000 కిలోల పైనే బరువుండే బాలిస్టిక్ మరియు బ్లాస్ట్ సర్టిఫైడ్ ఆర్మర్ కవచంతో కప్పబడి ఉన్న ఈ కారు మొత్తం బరువు 2 వేల కిలోలు ఉంటుంది. ఇక ఇందులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి దాడుల నుంచైనా లోపల కూర్చున్న వారికి ఏమీ కాకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించారు. ఆధునిక దాడులను మరియు అసాధారణ దాడులను తట్టుకునే విధంగా.. దీని బాడీని కఠినమైన పదార్థాలతో దృఢంగా తయారు చేశారు. ఇది దాడులు, ఐఈడీ పేలుడు పదార్థాల నుంచి కాపాడుతుంది. అదనపు రక్షణ కోసం అధునాతన భద్రతతో కూడిన భాగాలతో ఆర్మర్డ్ గ్లాస్ ను అమర్చారు.
భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా.. వాహనం బయట ఉండే వ్యక్తులతో కమ్యూనికేట్ అయ్యేందుకు పబ్లిక్ అడ్రస్సల్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు. అదనంగా సైరన్, అత్యవసర లైటింగ్ ఫ్యాక్స్ ఈ కారులో అమర్చారు. ఇందులో 5 లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 ఇంజన్ ను అమర్చారు. దీని ముందు వాడిన వి6 మోడల్ కంటే ఇది 40 బీహెచ్పీ అధిక శక్తిని అందిస్తుంది. ఈ రేంజ్ రోవర్ ను ఆధునిక సాంకేతికత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. లేటెస్ట్ టచ్ ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 2 10 అంగుళాల హై రిజల్యూషన్ టచ్ స్క్రీన్లు ఇందులో అమర్చారు. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా, సహజంగా, నావిగేషన్, ఎంటర్టైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లను సులువుగా కంట్రోల్ చేసేలా ఇందులో రూపొందించారు.
భారత ప్రధాని భద్రతకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యేలా ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ వాహనాన్ని అత్యంత అడ్వాన్స్డ్ మరియు సురక్షితమైన వాహనంగా రూపొందించింది టాటా అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ రోవర్. దీని అధునాతన సాంకేతికత, సెక్యూరిటీ ఫీచర్లు, ఆల్ టెర్రైన్ క్యాపబిలిటీ పరంగా.. ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ ప్రధానమంత్రి రవాణా అవసరాలకు సరైన ఎంపిక. ఇంత అత్యంత భద్రతతో.. పగడ్బంధీగా రూపొందించిన ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీ ధర పది కోట్లకు పైనే ఉంటుందని అంచనా. మరి భారత ప్రధాని భద్రత కోసం టాటా అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ తయారు చేసిన ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్‌యూవీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Hon. PM Shri @narendramodi pays homage to the martyrs at the National War Memorial on 74th #RepublicDay . https://t.co/ACf37F4y7b
— Jagat Prakash Nadda (@JPNadda) January 26, 2023