కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తోంది. మెున్న కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన ఈ పరిశ్రమ నిన్న కాంతారతో ప్రభంజనం నెలకొల్పింది.
రాకింగ్ స్టార్ యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్స్మ్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పేర్లు. తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాయి ఈ మూడు పేర్లు. దానికి కారణం ప్రధాన మంత్రి మోదీని కలవడమే. తాజాగా మోదీతో యశ్, రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్స్మ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ లతో పాటుగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. అయితే వీరంతా ప్రధాని మోదీని కలవడం కన్నడ పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మోదీని కలవడానికి కారణం ఏంటన్నదే ఇక్కడి ప్రశ్న.
కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తోంది. మెున్న కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన ఈ పరిశ్రమ నిన్న కాంతారతో ప్రభంజనం నెలకొల్పింది. దాంతో కన్నడ పరిశ్రమతో పాటుగా రాకింగ్ స్టార్ యశ్, రిషబ్ శెట్టి పేర్లు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయాయి. అయితే తాజాగా యశ్, రిషబ్ శెట్టి స్టార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ లతో పాటుగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ లు అందరు ప్రధాని మోదీని కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే? సోమవారం ప్రారంభించనున్న ఏరో ఇండియా ప్రారంభోత్సవానికి ఆదివారం బెంగళూరు వచ్చారు ప్రధాని మోదీ. రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన మోదీతో ప్రముఖ రాజకీయనాయకులు, క్రికెటర్లు, సినిమా స్టార్లు సమావేశం అయ్యారు.
అందులో భాగంగానే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి యశ్, రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వనీ మోదీని కలిసిన వారిలో ఉన్నారు. మోదీని కలిసి కన్నడ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను వారు వివరించారు. కర్ణాటకను ఫిల్మ్ సిటీగా మార్చాలని, ఫారిన్ లో ఉన్నటు వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్బంగా యశ్, మోదీకి అభ్యర్థించారు. వీటితో పాటుగా అత్యధిక పన్నులు చెల్లిస్తున్న సినీ పరిశ్రమ మాది అని అందుకు తగ్గట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ కోరినట్లు సమాచారం. కళాకారులకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా మోదీకి విన్నవించారు. ఇక సోమవారం 14వ ఏరో ఇండియా ఎడిషన్ ను మోదీ ప్రారంభించారు.
PM Narendra Modi meets KGF star Yash, Kantara star Rishab Shetty and others in Bengaluru. #PMNarendraModi #Yash #RishabShetty #Kantara #KGF2 https://t.co/7DQOh42hUn
— R.Glitz (@republic_glitz) February 13, 2023