సినిమా షూటింగులు లేకపోవటంతో యశ్ తన కుటుంబంతో కలిసి టూర్లకు, గుళ్లకు తిరుగుతున్నారు. తాజాగా, ఆయన మైసూరులోని నెంజన్‌గుడ్ గుడికి వెళ్లారు.
కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రాకింగ్ స్టార్ యశ్. కేజీఎఫ్ 1,2 సినిమాల్లో ఆయన యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాకీ భాయ్‌గా ఆయన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. రెండు సినిమాలను ఊహించని రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్ చేశారు. కేజీఎఫ్ 2 సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతోంది. అయినప్పటికి యశ్ ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇంత వరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కథల ఎంపిక విషయంలో యశ్ నిక్కచ్చిగా ఉంటున్నారట. తీయబోయే సినిమా తన ఇమేజ్‌ను పెంచేదిగా ఉండాలని ఆయన భావిస్తున్నారట.
అందుకే కథలు వినటం దగ్గరే ఆగిపోయారు. సినిమా షూటింగ్‌లు లేకపోవటంతో కుటుంబంతో ఎక్కువగా గడుపుతున్నారు. భార్య, పిల్లలతో కలిసి టూర్లకు, గుళ్లకు వెళుతున్నారు. యశ్ తాజాగా, తన కుటుంబంతో కలిసి సొంతూరైన మైసూరులోని ఓ ప్రముఖ గుడికి వెళ్లారు. నెంజన్‌గుడ్‌కు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దైవ దర్శనం సందర్భంగా యశ్.. ఆయన భార్య రాధికా పండిత్, కుమారుడు, కూతురు గర్భ గుడి ముందు కూర్చుని ఉన్నారు. పూజారి వారి దగ్గరకు హారతి పల్లెం తీసుకుని వచ్చాడు.
హారతి తీసుకున్న తర్వాత యశ్ తన కుమారుడి చేతిలో 500 రూపాయల నోట్లు పెట్టి పల్లెంలో వేయించాడు. తర్వాత కూతురి చేతికి డబ్బు ఇచ్చాడు. ఆమె ఎడమ చేత్తో డబ్బు పల్లెంలో వేసింది. దీంతో యశ్ తన కూతుర్ని పిలిచాడు. డబ్బులు కుడి చేత్తో వేయాలని చెప్పాడు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత పెద్ద స్టార్ అయినా కూతురి విషయంలో తండ్రేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.