ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు టీర్పీలు పెంచుకోవడం కోసం రీల్ లవ్ స్టోరీలు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఫేమస్ అయిన వారిలో రష్మి-సుధీర్ జంటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిదంతా నటన మాత్రమే.. షో కోసం అలా లవర్స్‌గా నటిస్తుంటారు. కానీ జబర్దస్త్‌లో రియల్ లవర్స్ కూడా ఉన్నారు. వారే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. ప్రారంభంలో వీరిద్దరిని కూడా రీల్ కపుల్ అనుకున్నారు. కానీ ఈ ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. అదే సమయంలో స్జేటీ మీదే సుజాతకు రింగ్ తొడిగి మరీ ప్రపోజ్ చేసి.. తాము నిజంగానే ప్రేమించుకుంటున్నాం అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు సుజాత ప్రకటించింది. దీని గురించి తన యూట్యూబ్ చానెల్‌లో వెల్లడించింది.
ఈ క్రమంలో తమ ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా అందరికి చెప్పడానికి కారణం రోజా అన్నారు. తమ మధ్య ప్రేమకు కారణం కూడా రోజానే అని తెలిపింది సుజాత. తాజాగా తన యూట్యూబ్ చానెల్ రోజా హోమ్ టూర్ వీడియోని అప్‌లోడ్ చేసింది సుజాత. దీనిలో తాను, రాకేష్ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజాగారే గుర్తించారని తెలిపింది సుజాత. ఆమె ప్రోత్సాహం వల్లే తమ ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా ప్రకటించామని చెప్పుకొచ్చింది. తమ ప్రేమకు కారణం రోజాగారే అని వెల్లడించింది. ఇక త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది సుజాత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.