జబర్దస్త్ షో ద్వారా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్. ఆ షో ద్వారా కంటెస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎన్నో మంచి స్కిట్స్ చేసి జనాలను అలరించాడు.
తన ఫ్రెండ్ అయిన సుజాతో ప్రేమలో ఉన్నాడని రకరకాల పూకార్లు వచ్చాయి. వీరు ఎక్కడికి వెళ్ళిన కలిసే వెళ్లేవారు. సుజాత అప్పుడప్పుడు రాకేష్ వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉండేది. అందరు వీరిద్దరిని ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే జోర్దార్ సుజాతని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. వీరిది ప్రేమ వివాహం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. జబర్డస్త్ షోలో వీరిద్దరు కలిసి చాలా ఎపిసోడ్స్ చేశారు. సుజాత విషయానికి వస్తే కొన్ని టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా చేసింది. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సపరేటు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ.. ఉంటుంది. ఇక తాజాగా రాకేష్ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యింది. అసలు దేని గురించి అంత ఎమోషనల్ అయ్యిందంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో సుజాత, రాకేష్ జంటగా కనిపించారు. ఇందులో కొన్ని రీల్ జంటలు, కొన్ని రియల్ జంటలు పాల్గొన్నాయి. షో అంతా సందడిగా సాగింది. అయితే ఈ షోలో సుజాత తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తను మాట్లాడుతూ.. రాకేష్‌కి ఇంజక్షన్ అంటే చాలా భయం, ఫీవర్ వస్తే టాబ్లెట్ వెసుకుంటాడు. కానీ.. ఇంజక్షన్ మాత్రం అస్సలు వేసుకోడు. కానీ నా కోసం తన చేయి మీద పచ్చ బొట్టు వేసుకున్నాడు. అది వేసుకున్నప్పుడు చాలా బాధ ఉండే అయిన ఆ నొప్పిని తట్టుకుని పచ్చబోట్టును వేసుకున్నాడు అంటూ.. ఎడుస్తూ చెప్పింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీరిద్దరు పెళ్లి చేసుకున్నకా రోజ వాళ్ల ఇంటికి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. రోజ అంటే రాకేష్‌కి , సుజాతకి చాలా అభిమానం. రోజా కూడా నూతన దంపతులకి బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసింది. పెళ్లాయ్యాక చాలా టీవీ షోస్‌కి గెస్టులుగా వెళ్ళారు. ఎన్నో జంటలు పెద్దలు ఒప్పుకోకపోతే విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటారు, కానీ రాకేష్ జంట మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఇప్పుడు హ్యాపీగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ జబర్దస్త్ తో పాటు వివిధ ఈవెంట్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు.