జబర్దస్త్ మహేశ్.. గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ మహేశ్ అనగానే సన్నగా.. పొడుగ్గా కాళ్లు ఉన్న ఓ కుర్రాడు చేసే కామెడీ గుర్తొస్తుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మెరిసిన మహేశ్.. తనదైన స్లాంగ్ .. డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి తలచకుని కన్నీరు పెట్టుకున్నాడు.
జబర్దస్త్ మహేశ్.. గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ మహేశ్ అనగానే సన్నగా.. పొడుగ్గా కాళ్లు ఉన్న ఓ కుర్రాడు చేసే కామెడీ గుర్తొస్తుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మెరిసిన మహేశ్.. తనదైన స్లాంగ్ .. డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత అతను సినిమాలో చిన్నచిన్న పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళుతున్నాడు. రంగస్థలం సినిమాతో మహేశ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య రోల్స్ చేస్తున్నాడు. అయితే తాజాగా సుమన్ టీవీలో ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్.. తన కుటుంబానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ఎమోషనలయ్యారు.
జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను మహేశ్ పరిచయం అయ్యాడు. తనదైన మాటల, పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అలానే జబర్దస్త్ షో ద్వారా మహేశ్ మంచి క్రేజ్ సంపాదించాడు. అక్కడ వచ్చిన ఫేమ్ తో సినిమాలో అవకాశాలు సంపాదించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో .. రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. అయితే తనకు ఇంత పేరు ప్రఖ్యాతుల ఒక్క రోజులో రాలేదని, అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన అన్నారు.
మహేశ్ మాట్లాడుతూ .. “నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైన సినిమాల్లో నటించాలని హైదరాబాద్ వచ్చాను . సినిమాలనే నమ్ముకున్నాను .. జీరోతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే మా నాన్న చనిపోయారు. ఆ సయమంలో ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు. దాంతో సినిమాలు అవసరమా? అంటూ మా బంధువులంతా నన్ను తిట్టారు.ఆ సందర్భంగాలో నేను మాత్రం చాలా బాధపడ్డాను” అని మహేశ్ ఎమోషనలయ్యాడు.
సినిమాల కోసం హైదరాబాద్ వచ్చిన తనను ‘జబర్దస్త్’ షోకి షకలక శంకర్ పరిచయం చేశాడని మహేశ్ అన్నారు. సుకుమార్ గారి చుట్టూ తిరిగితే, 2017లో ఆయన ‘రంగస్థలం’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని మహేష్ తెలిపాడు. ఇన్నేళ్లు ఆగిన ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందంటు మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకుముందు తనకు సొంత ఇల్లు కూడా లేదని, ఇటీవలే ఇల్లు కట్టుకున్నానని మహేశ్ అన్నాడు. మరి.. మహేశ్ షేర్ చేసుకున్న అతడి వ్యక్తిగత విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.