యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జోర్దార్ సుజాత.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్, బిగ్ బాస్ షోల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇక ఈమె జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్ టీమ్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్టేజ్‌పైనే వీరి ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. సినిమాలకి వెళ్ళినా, షికార్లకి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తున్నారు. రీసెంట్‌గా గోవా బీచ్‌లో కూడా ఈ ఇద్దరూ సందడి చేశారు. దీంతో ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా జోర్దార్ సుజాత ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఆగస్ట్ 5న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆమె వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకున్నారు. అయితే ఆమె ఈ వ్రతం సెలబ్రేట్ చేసుకున్నది ఆమె ఇంట్లో కాదు, ప్రియుడు రాకేష్ ఇంట్లో. కాబోయే అత్తగారితో కలిసి వరలక్ష్మీ వ్రతం చేశారు. ఇలా రాకేష్ ఇంట్లో పూజ చేయడం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. ఎందుకంటే ఇన్నేళ్ళు అమ్మ గారి ఇంట్లో ఇంత భారీగా వ్రతం చేసుకోలేదని, రాకేష్ ఇంట్లో చాలా ఘనంగా వరలక్ష్మీ వ్రతం చేశామని అన్నారు. అందుకే ఈ ఏడాది తనకెంతో స్పెషల్ అని అన్నారు. పెళ్ళి కాని అమ్మాయిలు పూజ చేసుకుంటే మంచి భర్త వస్తాడని, పెళ్ళయిన వారు భర్త మంచిగా ఉండాలని ఈ పూజ చేసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు.
పూజ ప్రారంభం నుండి అయ్యే వరకూ రాకేష్ తల్లితోనే ఉన్నారు. పూజ గురించి, వరలక్ష్మీ వ్రతం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ వీడియోను ఆమె తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే రాకేష్, సుజాత ఇద్దరూ ఒకటవ్వాలని ఆశీర్వదిస్తున్నారు. మరి కాబోయే భర్త ఇంట్లో కాబోయే అత్తతో వరలక్ష్మీ వ్రతం చేసిన సుజాతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.