జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొంత కాలం క్రితం వరకు అతడి గురించి జబర్దస్త్‌లో మాత్రమే వార్తలు కనిపించేవి. కానీ ఎప్పుడయితే జోర్దార్ సుజాతతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక వీరిద్దరూ చేసే స్కిట్స్ కూడా బాగానే వైరలవుతున్నాయి. అయితే ప్రాంరభంలో వీరిద్దరి లవ్ ట్రాక్ చూసిన వారు.. రష్మి-సుధీర్‌లానే వీళ్లది కూడా టీఆర్పీ రేటింగ్ కోసం క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ అని భావించారు. కానీ వీరిద్దరూ రీల్ మీదనే కాక.. రియల్‌గా కూడా లవర్స్ అని చెప్పేశారు. తాజాగా శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుజాత.. కాబోయే అత్త అంటే రాకేష్ ఇంట్లో పూజ చేసిన వీడియోని తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసింది.
ఇక తాజాగా మరో సారి రాకేష్-సుజాత తమ ప్రేమ గురించి స్టేజీ మీదే ఒపెన్ అయ్యారు. తాజాగా శ్రావణి సందడి షోలో వీరిద్దరూ స్టేజీ మీద తమ ప్రేమ గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. మాది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేష్ మాటలు విన్న సుజాత అతడిని కౌగిలించుకుని.. ముద్దుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.