తెర మీద నవ్వుతూ, నవ్విస్తూ.. అందంగా కనిపించే జబర్దస్త్ యాంకర్ సౌమ్య జీవితంలో అంతులేని విషాదం దాగుంది. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందింది. ఈక్రమంలో మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యింది సౌమ్య. ఆ వివరాలు..
‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్యారావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికన్నా ముందు సౌమ్యా రావు.. పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సడెన్‌గా అనుకోకుండా ‘జబర్దస్త్’ యాంకర్ గా షోలోకి అడుగు పెట్టింది. వచ్చీరాని తెలుగుతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. కంటెస్టెంట్ల మీద అదిరిపోయే పంచులు వేస్తూ.. అందరినీ నవ్విస్తుంది. బుల్లితెరపై చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సౌమ్య.. నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. మరి ముఖ్యంగా ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ఇక తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని.. ఆమెతో తీసుకున్న వీడియోలను షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది యాంకర్ సౌమ్యా రావు. ఆమె పోస్ట్ చూసిన నెటిజనులు ధైర్యంగా ఉండండి మేడం అని కామెంట్స్ చేస్తున్నారు.
మదర్స్ డే రోజు తల్లి తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది యాంకర్ సౌమ్యా రావు. మదర్స్ డే రోజు తన తల్లితో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఎమోషనల్ అయ్యింది. ఆమె ఆఖరి రోజుల్లో పడిన కష్టాలు తలుచుకుని భావోద్వేగానికి గురైంది సౌమ్య. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందింది. ఈ క్రమంలో చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వర్ణిస్తూ.. అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. వీడియోతో పాటు.. తన తల్లి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో వివరించింది యాంకర్ సౌమ్య.
“అమ్మ, అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్‌మెంట్, మందులు, బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు. అమ్మ కోసం నేను మొక్కని దేవుడు లేడు. వెళ్లని గుడి లేదు. అమ్మ ఆరోగ్యం కోసం ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నీ మీద, నా మీద కరుణ చూపించ లేదు. దేవుడు ఎందుకు ఇంత నిర్దయగా ప్రవర్తించాడు అని చాలా బాధపడుతున్నాను. అందరూ అమ్మ ఫోటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడిన బాధే జ్ఞాపకం వస్తుంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది.
‘‘రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి ఎన్ని పూజలు చేసినా.. అవన్ని వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి రోజు, ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు నా కోసం మళ్లీ పుడతానని ఎదురు చూస్తున్నాను. దేవుడా! మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. హ్యాపీ మదర్స్ డే అమ్మా! ఆల్వేస్ మిస్సింగ్ యూ! లవ్ యూ సో సో సో మచ్!” అంటూ తన మనసులోని బాధను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది సౌమ్య. జబర్దస్త్ యాంకర్ షేర్ చేసిన వీడియోలో పూర్తిగా చిక్కిశల్యమైన రూపంతో.. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న సౌమ్య తల్లిని చూస్తే.. ఎవరికైనా బాధ కలగక మానదు. సౌమ్య పోస్ట్ చూసిన జనాలు.. ఆమెను ఓదారుస్తున్నారు. మీరు కొల్పోయిన సంతోషాలను దేవుడు తిరిగి ఇస్తాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సౌమ్య చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.