రీజనల్ సినిమాగా చెప్పుకునే చాలా ఇండస్ట్రీలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో తమ సత్తా చాటుతుండటం చూస్తున్నాం. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాన్సెప్ట్ ప్రస్తుతం ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాలు ఒక భాష, ఒక ప్రాంతం అనే సరిహద్దులు, అవరోధాలను తుడిచిపెట్టేసి.. దేశవిదేశాల్లో బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మార్కెట్ ను డైరెక్టర్ సుకుమార్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రూ.4 వేల కోట్లు కలెక్ట్ చేయడమే లక్ష్యంగా సుకుమార్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది సాధ్యమా? కాదా? అసలు అందుకు అవకాశాలు ఉన్నాయా?
ఇదీ చదవండి: దేవీ నాగవల్లికి విశ్వక్ సేన్ థ్యాంక్స్ చెప్పాలంటూ కొత్త డిమాండ్..!
సినిమాలో దమ్ముంటే రీజియన్ మూవీ అయినా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందని బాహుబలితో దర్శక ధీరుడు రాజమౌళి నిరూపించారు. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. అది కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సాధించిన ఘనత అది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. 250 కోట్లు పెట్టి సినిమా తీస్తే ప్రంపచవ్యాప్తంగా రూ.1810 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కోసం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూశారు. తాజాగా ట్రిపులార్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలు కేవలం 2 వారాల వ్యవధిలోనే రూ.వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాయి.
పాన్ ఇండియానే కాదు.. కథ, కథనం ఉంటే ప్రపంచ మార్కెట్ ను కూడా ఇండియన్ సినిమా టార్గెట్ చేయగలదని నిరూపించిన చిత్రం అమీర్ ఖాన్ నటించిన దంగల్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.2,024 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.70 కోట్లు మాత్రమే. ఒక్క చైనా మార్కెట్ లోనే దంగల్ సినిమా రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు సుకుమార్ కన్ను ప్రపంచ మార్కెట్ మీద పడిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని, అసలు ఊహకు కూడా అందని టార్గెట్ సుకుమార్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప 2తో రూ.4 వేల కోట్లు కలెక్ట్ చేయాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ జోరందుకుంది.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. KGF నటుడు మృతి!
సరైన ప్రణాళికతో ముందుకు వస్తే సుకుమార్ పెట్టుకున్న టార్గెట్ సాధించడం అసాధ్యమేమీ కాదనే చెప్పాలి. దంగల్ సినిమా విడుదల సమయంలో ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు, కనీసం హీరో పాత్రకు సరైన ఎలివేషన్స్ కూడా లేవు. కేవలం కథ పరంగా మాత్రమే ఈ సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్-2 సినిమా విషయానికి వస్తే.. మొత్తం రాఖీ భాయ్ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం రాఖీ ఎలివేషన్స్ తోనే సినిమా సాగుతుంది. ఇక్కడ కథ కన్నా కూడా హీరో పాత్రకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పాత్రతోనే కేజీఎఫ్ 2 సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి 2 విషయానికి వస్తే బాహుబలి బిగినింగ్ తో వచ్చిన క్రేజ్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఎదురు చూశారు.
ఇంక పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా, బాలీవుడ్ లో కనీసం సరైన ప్రమోషన్స్ కూడా చేయకుండానే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.365 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా కంప్లీట్ రన్ పూర్తి అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా పుష్పరాజ్ మేనరిజం, డైలాగులతో హోరెత్తించారు. క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు, పాప్ సింగర్లు, సినిమా హీరోలు, సెలబ్రిటీలు, ఆఖరికి రాజకీయ నాయకులు కూడా తగ్గేదేలే అంటూ డైలాగులు, మీమ్స్, రీల్స్, స్టోరీలతో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అదే పుష్ప-2 సినిమా మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. పుష్ప 2 సినిమాకి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఓపెన్ గా ఉంది.
ఇదీ చదవండి: KGF 3 Big Update: ‘కేజీయఫ్ 3’లో రానా దగ్గుబాటి?
ఇవన్నీ సుకుమార్ దృష్టిలో పెట్టుకుని పుష్ప-2 ని పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో మరిన్ని భాషల్లో విడుదల చేస్తే రూ.4 వేల కోట్లు కలెక్ట్ చేయడం కష్టం కావచ్చు.. కానీ, అసాధ్యం మాత్రం కాదు. ఆ ప్రణాళికతోనే సుకుమార్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కాస్త టైమ్ తీసుకుని అయినా పుష్ప-2 సినిమాకి ఉన్న క్రేజ్, మార్కెట్ ను ఉపయోగించుకుని సరైన సమయంలో, సరైన రీతిలో వచ్చి వరల్డ్ వైడ్ మార్కెట్ లో తన సత్తా చాటేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. అదే నిజమైతే సౌత్ సినిమా ఖ్యాతి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుతుందని చెప్పొచ్చు. పుష్ప-2 సినిమా పాన్ వరల్డ్ కాన్స్ పెట్ తో విడుదల చేయడమే కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.