గతంలో పోలిస్తే.. సినీ పరిశ్రమలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరో పెద్ద హీరో అతిథిగా విచ్చేసి.. సినిమా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అంతేనా మేమంతా బాగున్నాం అని చెప్పేందుకు మల్టీ స్టారర్ మూవీలో నటిస్తూ.. మరికొందరికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు మన హీరోలు. అందులోనూ యంగ్ జనరేషన్‌లో స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.
సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న డార్లింగ్ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
'నాటు.. నాటు..' పాటకు ఆస్కార్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్ భాగమైన సంగతి అందరికీ విదితమే. రాహుల్.. కాల భైరవతో ఈ పాటను ఆలపించారు. ఈ సందర్బంగా అతనిని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ నజరానా కూడా ప్రకటించింది.
సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరి సందడి మాత్రం ఒక్కోసారి హద్దుమీరుతుంది. అత్యుత్సాహంలో వారేం చేస్తారో కొన్ని సార్లు వారికే తెలియదు. తాజాగా నిన్న మ్యాచులో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా RRR మూవీనే అవమానిస్తూ ఒక పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఇక ఈ వార్తలపై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు నిర్మాత దానయ్య.
ఎప్పుడూ కచ్చితమైన విజన్ తో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి కూడా తన విజన్ తో ముందుకెళ్లి ఆస్కార్ ను ఒడిసిపట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టిన ప్రతీ పైసా రాబట్టే పనిలో ఉన్నాడు. మరి అన్ని కోట్లు రాజమౌళి ఎలా రాబట్టాలని చూస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
పూనకాలు తెప్పించే ఒక పాట వస్తుంటే మనుషులు డ్యాన్స్ వేయకుండా ఉండలేరు. అయితే వస్తువులతో కూడా డ్యాన్స్ చేయించే వారు ఉంటారు. అంటే బీట్ కి తగ్గట్టు వస్తువుల మూమెంట్స్ ని సింక్ చేస్తారు. తాజాగా వందకు పైగా కార్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
అభిమాన హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వాచెస్, యాక్ససరీస్ ని కొనుగోలు చేయాలి, అలాంటి ధరించాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. అందుకే అలాంటి వస్తువుల కోసం ఎక్కువగా నెట్టింట వెతుకుతుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఒక హుడీ గురించి అందరూ వెతుకులాట మొదలు పెట్టారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాయి. బాహుబలి, బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ విజయం అందుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.