రీసెంట్‌గా కన్నడ చిన్నది, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే.. రష్మిక బూతులు మాట్లాడింది.
హీరోయిన్స్ ఏం చేసినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఫోటోషూట్స్, రీల్స్, వెకేషన్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ అయితే తెగ ట్రెండ్ అవుతుంటాయి. రీసెంట్‌గా కన్నడ చిన్నది, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే.. రష్మిక బూతులు మాట్లాడింది. చూస్తుంటే ఎవరి దగ్గరో నేర్చుకుని మరీ ముద్దుముద్దుగా తిడుతున్నట్లుంది. ఎవర్ని తిడుతుందనేది రివీల్ చెయ్యలేదు కానీ అచ్చ తెలుగులో అదరగొట్టేసింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ లో వెంకటేష్.. ఆర్తి అగర్వాల్‌తో ‘నువ్వు ఒక్క మాట మాట్లాడితే అందులో 100 బూతులు వెతుక్కోవచ్చు’ అంటాడు కదా.. అలా ఇన్‌డైరెక్ట్‌గా ఎందుకు అనుకుందేమో మరి.. నేర్చుకున్న బూతుల్ని నేరుగా చెప్పేసింది. అది కూడా పిల్లలు పాఠాలు అప్పచెప్తున్నట్లు కావడం విశేషం.
‘నమస్తే, ఎట్లా ఉన్నారు?’ అంటూ పద్ధతిగా మొదలెట్టిన రష్మిక.. ‘వచ్చేసెయ్, మస్తుంది, నీ అమ్మా, ఏంది?, కొడదాం’ అని గలగలా చెప్పి, కిలకిలా నవ్వేసింది. ఇంతకీ అమ్మడు అసలు ఎందుకలా మాట్లాడింది, ఏంటా బూతులు.. ఎవరిని తిట్టింది?.. లేక సరదాగా వీడియో కోసమే అలా మాట్లాడిందా? అనేది తెలియదు కానీ.. ‘వీడియో చూసి షాక్ అయ్యారా!’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో మాత్రం తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్, పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది.
రీసెంట్‌గా మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసి కుర్రాళ్లకు కిక్ ఇచ్చింది. అమ్మడికి ఇన్‌స్టాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 38.8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు తనని. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప : ది రైజ్’ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. అక్కడినుండి ‘తగ్గేదే లే’ అంటూ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తుంది. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ లోనూ చేస్తుంది. రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ తో బాలీవుడ్‌లో బిజీ కావాలని కలలు కంటోందీ కన్నడ కస్తూరి.