పుష్ప 2 షూటింగ్ ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయిన మారేడి మిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. యాక్షన్ సీన్‌లను తెరకెక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా క్రియేట్ చేసిన మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. నార్త్ ఆడియన్స్ అయితే పుష్పరాజ్‌ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. సినిమాను సూపర్ హిట్ చేశారు. పుష్ప సాధించిన సంచలన విజయంతో పుష్ప 2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప 2 వీడియో ఒకటి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పేసింది. దీంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరావేగంగా జరుగుతోంది.
ఎక్కువ శాతం షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని లొకేషన్స్‌లోనే జరుగుతోంది. తాజాగా, ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మారేడి మిల్లి అడవుల్లో షూటింగ్ జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన షూటింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఎర్ర చందనం దుంగల లోడు ఉన్న లారీలు కొన్ని కాల్వలో పరుగులు పెడుతున్నాయి. వాటి వెనక, ముందు షూటింగ్ కెమెరాలతో ఉన్న కార్లు ఉన్నాయి.
ఓ చోట వంతెనపై ఉన్న దీన్నంతా వీడియో తీశారు. కాగా, పుష్ప 2 సినిమాలో కొత్తగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారు. విజయ్‌కు జతగా ప్రియమణి నటించనుందని సమాచారం. సుకుమార్ పుష్ప 2ను మొదటి భాగాన్ని మించి అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారట. హీరో ఎలివేషన్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక, ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్‌డేట్ డిసెంబర్ నెలలో వచ్చే అవకాశం ఉంది. మరి, వైరల్‌గా మారిన పుష్ప 2 షూటింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#pushpa 2 maredimilli Andhra and Telangana border. pic.twitter.com/jooFwwvY7h
— RameshVaitla (@RameshVaitla) June 16, 2023