ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ఫ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజు గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ తొలిసారిగా మాస్‌లుక్‌లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నది. అల్లు అర్జున్ తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. పుష్ప సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తున్నది. యూట్యూబ్ లో విడుదలైన టీజర్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నది. యూట్యూబ్ లో ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ -2 191 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉండగా పుష్ప సెకండ్ ప్లేస్‌కు చేరుకుని రికార్డ్ సృష్టించింది.
పుష్ప టీజర్ 72.44 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. 1.4 మిల్లియన్ లైకులతో పాటు లక్షకు పైగానే కామెంట్స్ కూడా ఈ వీడియోకు రావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అల్లు అర్జున్ తిరగరాశారు. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన భారీ స్కై ఫై థ్రిల్లర్ రోబో “2.0” టీజర్ 72.44 మిలియన్ వ్యూస్ తో రెండో ప్లేస్ లో ఉండగా పుష్ప దాన్ని తాజాగా దాటేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ICONIC Mass star @alluarjun is the only hero in TFI with two 100K Commented posts in Twitter 🔥
Pure @alluarjun Fans Masss 🔥⚡ #Pushpa // @alluarjun pic.twitter.com/5DloAg427H
— AFWA Pathanamthitta Official (@getafwapta) June 5, 2021