Sudheer: బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ షోలో కనిపించడం లేదని, జబర్దస్త్ నుండి తానే వెళ్లిపోయాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సుధీర్.. ఒక్కసారిగా షోలో, రాంప్రసాద్ టీమ్ లో కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తర్వాతే హైపర్ ఆది ఫేమ్ లోకి వచ్చాడని విషయం విదితమే.
ఇక సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయి కామెడీ స్టార్స్ లో సందడి చేయడం చూస్తున్నాం. ఓవైపు సినిమాలు చేసుకుంటూ, మరోవైపు నాగబాబు జడ్జిగా ఉన్నటువంటి కామెడీ స్టార్స్ లో హోస్ట్ గా పార్టీ చేద్దాం పుష్ప షో చేస్తున్నాడు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వదిలి పోవడానికి కారణాలు ఇవేనంటూ.. పలు అవమానాల కారణంగానే సుధీర్ షో వదిలి కామెడీ స్టార్స్ కి వెళ్లిపోయాడంటూ వచ్చిన ఆరోపణలపై తాజాగా హైపర్ ఆది, సుధీర్ ఫ్రెండ్ ఆటో రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జబర్దస్త్ నుండి ఎవరూ సుధీర్ ని బయటికి పంపించలేదని, తనకు తానుగానే షో నుండి వెళ్లిపోయాడని చెప్పారు ఆది, రాంప్రసాద్. సుధీర్ కెరీర్ జబర్దస్త్ లో స్టార్ట్ అయినప్పటికీ, జబర్దస్త్ కన్నా బెటర్ రెమ్యూనరేషన్ కామెడీ స్టార్స్ వారు ఇస్తామని ఆఫర్ చేయడంతో సుధీర్ వెళ్లిపోయాడని చెప్పారు ఆది, రాంప్రసాద్. అదే విధంగా అసలు సుధీర్ కి జరిగిన అవమానాలు, అభిప్రాయభేదాలు ఏంటనేవి కూడా బయటపెట్టారు. ప్రస్తుతం ఆది, రాంప్రసాద్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వీరి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.