ఒక సినిమా తీసే ముందు ఆ కథ అనేక మంది వద్దకు వెళ్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫైనల్ గా ఒకరి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత సినిమా మిస్ అయ్యామని చాలా బాధపడతారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల సినిమాలు మిస్ చేసుకుంటారు కొంతమంది. తాజాగా నటి ప్రేమ కూడా అరుంధతి సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు.
1980, 90 దశకంలో యావత్ సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత మరణం.. అప్పటికీ, ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. ఆమె అప్పులపాలై చనిపోయిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె చావుకు అప్పులు కారణం కాదని, ఆమెది హత్య అయి ఉండవచ్చునన్న అనుమానాలు ఇప్పటికీ కొంతమందికి ఉన్నాయి. తాజాగా సిల్క్ స్మితది హత్యనా? లేక ఆత్మహత్యనా? అనే విషయం మీద సీనియర్ నటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న చక్రి ఊబకాయ సమస్యతో డిసెంబర్ 2014లో మరణించారు. అయితే ఆయన మరణంపై అనుమానం ఉందని చక్రి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనది సహజ మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉందని చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అన్నారు.
రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తు చేస్తేనే ముందుకుపోగలం. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదని, అందుకే నేను రాజకీయాలకు పనికి రాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. అదీకాక రాజకీయాల్లో నన్ను మోసం చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను రాజకీయాలకు పనికిరాను అంటూ.. భవిష్యత్ పొలిటికల్ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను గత ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మద్దతు ప్రకటించానో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
ఆదివారం(మార్చి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు వదిలిన చిన్నారి ప్రదీప్ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాడి ఘటనపై ట్వీటర్ వేదికగా స్పందించిన వర్మ.. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇండస్ట్రీలో స్టార్డమ్ ని చూసిన నటీనటులు.. కెరీర్ లో ఫేస్ చేసిన గుడ్, బ్యాడ్ ఇలా అన్ని విషయాలను ఏదొక టైంలో షేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలామంది హీరోల సరసన వర్క్ చేస్తారు. కాబట్టి.. ఆయా హీరోలతో వర్క్ చేసినప్పుడు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. ఈ క్రమంలో నటి లయ.. టాలీవుడ్ లో అందరు హీరోల గురించి మాట్లాడి.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.