50 ఏళ్ళ వయసులో కూడా తన గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించే టబు కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘కూలీ నెం.1’. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా టబు స్పందించింది. తన కెరీర్ కు ఆ సినిమా ఒక సాలిడ్ ఫౌండేషన్ అని పేర్కొందది. తనను పాపా అంటూ పిలుచుకునే దర్శకుడు, తన గురువు రాఘవేంద్రరావు తనను ఒక స్వప్నంలా తెరపై ఆవిష్కరించాడని టబు వివరించింది. మానవత్వం గురించి, అందం గురించి, సమయానికి ఉన్న విలువ గురించి, జీవితాన్ని ఆస్వాధించడం గురించి రాఘవేంద్రరావు తనకు మరిచిపోలేని పాఠాలను నేర్పించారంటూ టబు చెప్పుకొచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు ప్రముఖ నటి టబు. తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు ‘అలవైకుంఠపురంలో’ మళ్ళీ తళుక్కుమన్న సంగతి విదితమే.
టబు విషయానికొస్తే ఆమె పూర్తి పేరు టబాస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరా బాద్‌కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు. 1982లో వచ్చిన ‘బజార్’ అనే హిందీ సినిమాతో టబు తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1991లో వచ్చిన ‘కూలీ నెం 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ య్యారు. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘అందరివాడు’ తదితర చిత్రాల్లో నటించారు.
టబు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్ళిపోయింది. ‘అలవైకుంఠపురంలో’ తెలుగు సినిమాతో మరోసారి తళుక్కుమందామె.
టబు ప్రస్తుతం హిందీ చిత్రం ‘భూల్ భులయ్యా 2’లో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో టబు కనిపించబోతుంది.