మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.
రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనది అరుదైన వ్యక్తిత్వం అని డబ్బుకోసం పాకులాడే వ్యక్తి కాదంటూ తెలిపింది. తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కే అంటూ స్పష్టం చేసింది.
ప్రజాకవి, విప్లవవీరుడు, యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ నిన్న ఆదివారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.. వేలాది మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.