మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇమేజ్ సంపాదించారు. టాలీవుడ్ లోకి 1996 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సుస్వాగతం, తొలి ప్రేమ, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో మాస్, క్లాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా అభిమానులు పిలుస్తారు. వెండి తెరపై పవన్ కళ్యాణ్ మేనరీజానికి మెగా అభిమానులు ఫిదా అవుతారు. ప్రజాసేవ చేయాలని 2014 మార్చిలో కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చాలా సున్నతమైన మనస్థత్వం కలిగిన వ్యక్తి అని.. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మట్లాడుతారని అతని సన్నిహితులు అంటుంటారు. ఆయనకు చాలా కొద్దిమంది ఆత్మీయ స్నేహితులు ఉన్నారని అంటుంటారు. అలాంటి స్నేహితుల్లో ఒకరు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. 20 ఏళ్లుగా వీరిద్దరూ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆనంద్ సాయి తండ్రి కూడా ఆర్ట్ డైరెక్టర్. అప్పట్లో మూవీకి సంబంధించిన పలు విషయాలు మాట్లాడేందుకు చిరంజీవి ఇంటికి వెళ్లేవారు.. ఆనంద్ సాయి అతని తండ్రి. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడటం జరిగింది. సినీ ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని గతంలో పలుమార్లు చెప్పారు ఆనంద్ సాయి. ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేశారు.
2014లో ఆనంద్ సాయి చివరిసారిగా ‘ఎవడు’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ మూవీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించారు. ఆ తర్వాత 2015లో పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’మూవీలో పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన స్కెచ్ లు వేశారు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ, శ్రీ రామానుజాచార్యుల సమానత్వ విగ్రహాన్ని తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కోరిక మేరకు హరిహర వీర మల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలకు పని చేయనున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, ఆనంద్ సాయి కి సంబంధించిన ఓ ఫోటో ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.