మన దేశంలో క్రీడాకారులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువ. వీరికి ఫ్యాన్సే బలం, బలహీనత కూడా. ఈ అభిమానుల వల్ల సెలబ్రిటీలు కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు. ఓ వీరాభిమాని వల్ల ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఆ వివారలు..
సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంత కాలంగా వరుస పరాజాయాలు చవి చూడాల్సి వస్తోంది. ఇక తాజాగా సోనాక్షికి ఓ భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం సోనాక్షి.. ‘ది ఖత్రా ఖత్రా’ షోలో పాల్గొటుంది సోనాక్షి. దాని షూటింగ్‌లో పాలొగ్న సోనాక్షి.. బ్రేక్‌లో తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ‘మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా’ అని చెబుతాడు. అతడిని చూసి సోనాక్షి.. ఒక్కసారిగా బెదిరిపోతుంది.
ఇది కూడా చదవండి: విజయనిర్మలగా బయోపిక్ లో నటించే హీరోయిన్!?
ఆ వ్యక్తి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. సోనాక్షి అంటే తనకు ఎంత పిచ్చో వివరించే ప్రయత్నం చేస్తాడు. సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని ‘నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.’ అని అంటాడు. తర్వాత అద్దంపై లిపిస్ట్‌క్‌తో ‘ఐ లవ్ యూ సోనా’ అని రాశాడు. అంతేకాకుండా ‘ఇది నా రక్తంతో కూడా రాయగలను’ అంటాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అలా చేయవద్దు.. అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి ‘నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను’ అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పై కేసు నమోదు! నిజం ఏమిటంటే?
అయితే ఈ వీడియో అంతా ‘ది ఖత్రా ఖత్రా’ షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి డబుల్ ఎక్స్‌ఎల్ సినిమాలో నటించనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్? నిజమేంటంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.