విజయనిర్మలగా బయోపిక్ లో నటించే హీరోయిన్!?

తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల, దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.   ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తోన్న టాక్ ఏంటంటే విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించేందుకు ఇక ఆమె కొడుకు నరేష్ కథ సిద్ధం చేసారనీ,  సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ తెలుస్తోంది.

krishna Nirmal 1తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో రకాల బయోపిక్ తెరకెక్కించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఏకంగా రెండు సినిమాలను తెరకెక్కించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కింది . క్రీడ, రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రలను   ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తిగా చూపుతున్నారు.

అయితే విజయనిర్మల బయోపిక్ లో  ఆమె పాత్రలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అయితే బాగుంటుందని భావిస్తున్నారట. గతంలో కీర్తి సురేశ్ విజయనిర్మలగా నటిస్తుందనే వార్తలు రావడం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం టాక్ వినిపిస్తోంది.  ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.