టాలీవుడ్ లో ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్న పేరు పవిత్ర లోకేష్. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నప్పటినుంచి పవిత్ర లోకేష్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇంతటి అందం అభినయం ఉన్న ఆమె స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్న పేరు పవిత్ర లోకేష్. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నప్పటినుంచి పవిత్ర లోకేష్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇంతటి అందం అభినయం ఉన్న ఆమె స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేష్-పవిత్ర కలిసి మళ్లీ-పెళ్లి అనే సినిమాలో నటించారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాధరణ పొందుతోంది. అయితే పవిత్ర లోకేష్ ప్రస్తుతం సినిమాల్లో తల్లిగా, అత్తగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె తన నటజీవితంలో హీరోయిన్ గా రాణించినప్పటికి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. గ్లామర్ విషయంలో పవిత్ర లోకేష్ అప్పటి హీరోయిన్లకంటే అందగత్తె అని చెప్పుకుంటారు.
కర్ణాటకలోని మైసూర్ లో పవిత్ర లోకేష్ జన్మించారు. ఆమె తండ్రి కన్నడ స్టేట్ కమ్ ఫిల్మ్ యాక్టర్. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి పవిత్ర లోకేష్ అడుగులు పడ్డాయి. కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు, టెలివిజన్ లో కూడా నటించారు. 1994లో కన్నడ మెగాస్టార్ అంబరీష్ నటించిన మిస్టర్ అభిషేక్ సినిమాలో నటించింది. ఆమె కన్నడలో సుమారుగా 150కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2006లో వచ్చిన నాయి నేరాలు అనే చిత్రంలో పవిత్ర లోకేష్ నటనకు కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు. అయితే పవిత్ర లోకేష్ కు ఇదివరకే వివాహమైన విషయం తెలిసిందే. ఆమె మొదటి భర్త కన్నడ నటుడైన సుచీంద్ర ప్రసాద్. వీరికి ఇద్దరు సంతానం. ఆ తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని 2018లో విడిపోయారు. ఈ క్రమంలో నటుడు నరేష్ కు దగ్గరై సహజీవనం చేస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రక్షకుల అభిమానాన్ని పొందుతుంది. అయితే కట్టిపడేసే అందం ఆమె సొంతం అయినప్పటికి సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తక్కువగానే వచ్చాయని చెప్తుంటారు. దీనికి గల కారణం ఆమె హీరోల కంటే కూడా కాస్త పొడవుగా(5.10 అంగుళాల పొడవు) ఉండటమే స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని అంటుంటారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే.. మళ్లీ పెళ్లి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పవిత్ర లోకేష్ స్థానంలో అనన్య నాగళ్ల నటించింది. యుక్త వయసులో నటనతో పాటు గ్లామర్ తో అప్పటి యూత్ ను ఆకట్టుకున్నట్లు చూపించారు. మరి నరేష్ పవిత్ర పెళ్లి చేసుకుంటారా లేదా సహజీవనంతోనే కాలం గడుపుతారా అనేది వేచి చూడాలి.