సీనియర్ యాక్టర్ నరేష్-పవిత్రా లోకేష్‌ల జంట టాలీవుడ్‌లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వపిత్రా లోకేష్ గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
పవిత్ర-నరేష్‌లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న జంట. గత కొంత కాలంగా వీరిద్దరి మీద వచ్చినన్న వార్తలు.. వీరి చుట్టూ నడిచిన వివాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. లిప్ లాక్, పెళ్లి వీడియోతో ఓ రేంజ్‌లో హల్చల్ చేశారు. తీరా చూస్తే.. అవన్ని మళ్లీ పెళ్లి సినిమా కోసం చేసిన సీన్‌లు అని తెలిసింది. ఇక మళ్లీ పెళ్లి సినిమా ట్రైలర్, పాటలు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోనే ఈ సినిమా తీశారు అనే క్లారిటీ వచ్చింది. మరి మళ్లీ పెళ్లి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం నరేష్.. సంతోష్ శోభన్, మాళవిక జంటగా నటిస్తోన్న అన్ని మంచి శకునములే సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మే 18న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్.
సినిమా విడుదల నేపథ్యంలో.. ఆదివారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ యాక్టర్ నరేష్ ప్రసంగాలు ఆడియన్స్‌ను అలరించాయి. ప్రత్యేకించి షూటింగ్ లొకేషన్‌కు తన పార్ట్‌నర్ పవిత్రా లోకేష్ వచ్చిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు నరేష్.
ఈ మూవీ షూటింగ్ ‘విక్టోరియాపురం’లో జరిగింది. అయితే ఈ లొకేషన్ గురించి నరేష్ వివరిస్తూ.. ‘‘ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్‌లో షూటింగ్స్ పెట్టి, సరదాగా రిలాక్స్ అవ్వండని అప్పుడప్పుడు బ్రేక్‌లు ఇచ్చారు చిత్ర నిర్మాత. నాకు అక్కడ ఓ ఇల్లు కూడా ఉంది. పవిత్ర నాకోసం చక్కగా వంట చేసుకుని క్యారియర్ తెచ్చేది. ఇదంతా ఫెంటాస్టిక్ టైమ్. కానీ ఒక ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచిస్తే మాత్రం భయమేసేది. ఏదేమైనా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అందమైన సినిమా తీశారు. ఈ సినిమా 16 కూరల కంచం అని చెప్పవచ్చు. ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఇది గాలి కాదు, చిరుజల్లు’’ అన్నాడు నరేష్.
ఇక ప్రీ ఈవెంట్‌లో భాగంగా స్టేజికి పైకి మాట్లాడేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఐటెం ఇచ్చారు. అయితే నరేష్ స్టేజి పైకి వచ్చినపుడు మల్లెపూలు ఇవ్వడం విశేషం. దీనిపై నరేష్ స్పందిస్తూ.. ‘‘ముందు మా రాజేంద్ర ప్రసాద్ వస్తే మామిడికాయ ఇచ్చారు. సరే దానికి కారం, ఉప్పు కలిపి మందులో నంజుకుంటే బాగుంటుందని అనుకున్నాను. అలానే మా హీరో వస్తే సోడా ఇచ్చావ్. నాకు రాయల్ సెల్యూట్, బ్లూ లేబుల్ వస్తుందనుకుంటే మల్లెపూలు ఇచ్చావ్. అయినా ఓకే’’ అంటూ ఆ మల్లెపూలను చేతికి చుట్టుకుని కాసేపు సోగ్గాడి మాదిరిగా పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.