సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా టీజర్ రిలీజై మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇటీవల టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టిందీ చిత్ర బృందం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రుధారులందరూ ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
వర్షం మూవీ దర్శకుడు శోభన్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు సంతోష్ శోభన్. హీరోగా అరడజనుకు పైగా సినిమాలు చేసినా.. మంచి బ్రేక్ ఇచ్చే ఒక్క మూవీ అతడి ఖాతాలో పడలేదు. మంచి పేరున్న డైరెక్టర్లతోనే సినిమా తీస్తున్నాఫెయిల్యూర్ చవిచూస్తున్నాడు. ఇప్పుడు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన అన్నీ మంచి శకునములే సినిమాతో మరో సారి పరీక్షకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రమోషన్లలో పాల్గొంటోంది చిత్ర బృందం. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన కూడా వచ్చింది. స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఫక్తు ఫ్యామిలీ మూవీగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని మూవీ టీం నిర్వహించింది. సీనియర్ నటులు నరేష్, రాజేంద్ర ప్రసాద్, దర్శకురాలు నందినీ రెడ్డి, హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి, వాసుకి (తొలి ప్రేమ ఫేమ్) తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఇష్టంగా చేశామని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నందినీ రెడ్డి అన్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులను ఉగాది షడ్రుచులతో పోలుస్తూ వేదికపైకి పిలిచారు నందినీ రెడ్డి. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సీనియర్ నటుడు నరేష్‌పై ఫన్నీ కామెంట్లు చేశారు. అయితే అవన్నీ నరేష్ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి.
.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య సాగే కథ అని అన్నారు. ఈ సమయంలో పాత్రికేయులు రాజేంద్ర ప్రసాద్‌ను పలు ప్రశ్నలు వేశారు. రెండు కత్తులు ఓ వరలో ఇమడవు కదా అని నరేష్, రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి అడగ్గా.. తాను కత్తిని కాదని, నరేష్ కత్తేనని అన్నారు. తాను వర అంటూ కామెంట్స్ చేశారు. ‘ఆడు కత్తే, మామూలోడు కాదు. మీ అందరికి తెలుసు బాగా కత్తి వాడు అంటూ.. వాడి రేంజ్ కత్తి మేము వాడం‘ అంటూ సరదాగా ఆటపట్టించారు. నరేష్ తన తమ్ముడు అంటూ అనంతరం అతడిని దగ్గరికి పిలిచి.. చూశారా పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా.. అని అన్నారు. ‘ పెళ్లికొడుకు ఏంటీ నేను నిత్యం పెళ్లికొడుకే’గా ఉంటాను అన్నారు నరేష్. ఆ సమయంలో ‘అవునారా నేను చెప్పడం మర్చిపోయా నువ్వు నిత్య పెళ్లికొడుకువు రా’ అంటూ రాజేంద్ర ప్రసాద్ కౌంటరేశారు. దీంతో అక్కడున్న వారూ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.
ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓ వీడియోతో సంచలనం సృష్టించారు నరేష్. తాము పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని, ఆ వీడియో సినిమాలోని ఓ సన్నివేశమనే వాదనలు కూడా ఉన్నాయి. మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆయన ఈ పెళ్లి ఎలా చేసుకున్నారన్న ప్రశ్నలు వచ్చాయి. ఈ వీడియోపై కూడా రమ్య స్పందించకపోవడంతో.. అది సినిమా షూటింగ్ అని భావించారు. ఇక ‘అన్నీ మంచి శకనములే’ సినిమాలో నరేష్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ మూవీను మే 18 న విడుదల చేయనున్నారు.