సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్. చిత్రపరిశ్రమలో ఉండే చాలా మంది నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. వారే కాకుండా స్టార్ టెక్నిషియన్ల, డైరెక్టర్ల కూడా తమ వారసులను హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీకి పరియం చేస్తున్నారు. అలా వారుసులుగా వచ్చి.. సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా బుల్లితెర నటుడు, ఈటీవీ ప్రభాకర్ తనయుడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ఈక్రమంలో ప్రభాకర్ అనేక విషయాలు వెల్లడించారు.
ఈటీవీ ప్రభాకర్..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అనేక సీరియల్స్ లో విభిన్నమైన పాత్రలో నటించి బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక వెండితెరపై కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాందించారు. తాజాగా తన కుమారుడు చంద్రహాస్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ప్రభాకర్ సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 17వ చంద్రహాస్ పుట్టిన రోజు పురస్కరించుకుని శుక్రవారం ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియా ముందుకు వచ్చారు. అతను నటిస్తున్న చిత్రాల పోస్టర్లను చంద్రహాస్ తల్లి మలయాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ..”నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. నాలా మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటనే వృతిగా తీసుకుని ముందుకు వెళ్తున్నాడు.
ఓ వైపు చదువు కొనసాగిస్తూ మరొక వైపు సినిమాల కోసం ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్ వంటి అంశాల్లో శిక్షణతో తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్ కోరిక మాత్రమే. యూట్యూబ్ లో నాటు నాటు అనే కవర్ సాంగ్ చంద్రహాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈక్రమంలోనే హీరోగా కూడా రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ విషయంలో నేను ఆశ్చర్యపోయాను. వాటితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రోడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేశాం. దీనికి కథ, స్క్రీన్ ప్లేను నేనే అందిస్తున్నాను. ముందు రెండు చిత్రాలు ఇప్పటికే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది వాళ్ల అమ్మ మలయజ.
చంద్రహాస్ తాను చేసిన యూట్యూబ్ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది చంద్రహాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకం ఉంది” అని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రహాస్ చిత్రాల నిర్మాతలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ను ప్రభాకర్ వేదిక మీదకు పిలిచి మీడియాకు పరిచయం చేశారు. చివరిగా బంధుమిత్రులు, మీడియా, అతిథుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేశారు చంద్రహాస్. ప్రభాకర్ తనయుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.