సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే. ఎందుకంటే.. స్పెషల్ డేస్ అనేవి అందరి లైఫ్ లో ఉంటాయి. కానీ.. ఆ స్పెషల్ డే అనేది అభిమాన హీరో హీరోయిన్లకు పుట్టినరోజని తెలిస్తే.. ఫ్యాన్స్ కలిగే ఆనందం మరింత రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే.. తాజాగా హీరోయిన్ మీనా తన 46వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ వార్తల్లో నిలిచింది. మీనా గురించి తెలుగు ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా.. హీరోయిన్ గా ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసింది. తన అందచందాలతో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని షేక్ చేసేసింది.
ఇక హీరోయిన్ గా టాలీవుడ్ లోని అందరు స్టార్స్ సరసన సినిమాలు చేసిన మీనా.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొన్నేళ్ల కిందటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా ప్రస్తుతం నటిగా కీలకపాత్రలు పోషిస్తోంది. ఇటీవల తన భర్తను కోల్పోయిన మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధలో నుండి బయటపడుతూ ఓవైపు కూతురిని చూసుకుంటూ, మరోవైపు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మీనాకి చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా తనతో పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగువెలిగిన హీరోయిన్స్ అందరితో మీనా తన స్నేహాన్ని కంటిన్యూ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా సెప్టెంబర్ 16న మీనా బర్త్ డే కావడంతో.. ఆమె ఫ్రెండ్స్ అయినటువంటి రమ్యకృష్ణ, సంగీత, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, స్నేహ, రేణుక ప్రవీణ్ ఇలా కొంతమంది సోషల్ మీడియా వేదికగా విష్ చేయడమే కాకుండా పలువురు మీనా ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించడం జరిగింది. ఇక తన బర్త్ డే రోజున విష్ చేసిన ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేస్తూ.. మీనా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో థ్యాంక్స్ తెలిపింది. ప్రస్తుతం మీనా బర్త్ డేకి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మీనా బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఆనందంగా కనిపించింది. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మీనా బర్త్ డే ఫోటోలు, వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Happy Birthday to the Evergreen Queen #Meena ❤ #HBDmeena #HappyBirthdayMeena #HappyBirthdayEvergreenMeena #Meena #LadySuperstar pic.twitter.com/WXJ1P4QKqn
— Meenoviyam (@meena_actress_) September 15, 2022