ధనుష్ నటించిన 'సార్' సినిమా.. తెలుగు, తమిళ భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది. రిలీజ్ అయినప్పటినుండి సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విమర్శలపై స్పందించాడు డైరెక్టర్ వెంకీ.
మంచి సినిమాలను, మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు. ఇదివరకంటే కథలు లేక కమర్షియల్ సినిమాలు చేశారేమో అనుకోవచ్చు. కానీ.. కొన్నాళ్ళుగా కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు.. ఆదరిస్తున్నారు. ఇప్పటికీ అందరూ కాకపోయినా కొంతమంది హీరోలు ప్రధానంగా కంటెంట్ ని నమ్మే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో ధనుష్ ముందుంటారు. రీసెంట్ గా ధనుష్ నటించిన ‘సార్’ సినిమా.. తెలుగు, తమిళ భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది.
ఇక మూడు రోజుల్లోనే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేసరికి నాలుగో రోజునుండే సార్ మూవీ.. లాభాల బాటలో చేరిపోయింది. ఈ సినిమాని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రస్తుతం సార్ టీమ్.. సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి అటు ధనుష్ పై, దర్శకనిర్మాతలపై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. మరోవైపు సార్ సినిమా.. హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’, ఆమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యారని, మూలకథను సూపర్ 30 నుండే తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా పాకి.. ఆఖరికి దర్శకుడు వెంకీ అట్లూరి చెవిన పడింది.
ఈ క్రమంలో సార్ సినిమా గురించి వినిపిస్తున్న విమర్శలపై తాజాగా దర్శకుడువెంకీ స్పందించి, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంకీ మాట్లాడుతూ.. “చాలామంది ఈ సినిమాని సూపర్ 30, 3 ఇడియట్స్ తో పోల్చుతున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఆ సినిమాలకు, సార్ సినిమాకి సంబంధం లేదు. సూపర్ 30 రాకముందే నేను ఈ కథ రాసుకున్నా. అయితే.. కొంతమంది పోల్చుతున్నారని, సూపర్ 30 మూవీ చూశా. అది ఓ బయోపిక్, నాది కల్పిత కథ. ఈ కథ కూడా నా లైఫ్ లో జరిగిన మూమెంట్స్ తోనే రాశాను. ఎందుకంటే.. నేను 90స్ లోనే చదివాను. అప్పట్లో ఇవన్నీ లైవ్ లో చూశాను. ఇప్పుడీ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే అనందంగా ఉంది. నెక్స్ట్ సినిమాకి ఇంకా టైమ్ పడుతుంది. లవ్ స్టోరీస్ అని కాకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమా చేయాలని ఉంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెంకీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి సార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.