తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారానే సినిమాల్లో కూడా కమెడియన్ రోల్స్ చేస్తున్నాడు. అయితే.. హైపర్ ఆది అంటే ఎక్కడున్నా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడని, ఎప్పుడెప్పుడు తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు.
ఈ క్రమంలో కొంతకాలంగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవారు.. ఆది లేకుండా షో చూడలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మరి షోలో లేకుండా అటు సినిమాల్లోనూ కనిపించపోవడానికి కారణమేంటి? అసలు కొద్దిరోజులుగా ఆది ఏమైపోయాడు? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది జబర్దస్త్ ను వదిలేశాడా? అనే ప్రశ్నకు జబర్దస్త్ కమెడియన్, సీరియల్ ఆర్టిస్ట్ రోహిణి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొంతకాలంగా జబర్దస్త్ నుండి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారని, ఆ విధంగానే హైపర్ ఆది కూడా వెళ్లిపోయాడా? అనే ప్రశ్నకు స్పందించిన రోహిణి.. అలాంటిది ఏంలేదు. షో నుండి కాస్త బ్రేక్ తీసుకున్నారేమో కానీ ఎవరూ షోని వదలరు. మళ్లీ వస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రోహిణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రోహిణి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.