బుల్లితెర గ్లామర్ బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ పేరు ఖచ్చితంగా ఉంటుంది. పేరుకే బుల్లితెర యాంకర్ అయినా.. వెండితెర హీరోయిన్స్ ని మించిన రేంజ్ లో విష్ణుప్రియ అందాలను షో చేస్తుంటుంది. గతంలో టీవీ షోలు చేసేటప్పుడు నార్మల్ గానే ఉండేది. కానీ.. ఎప్పుడైతే షోలు ఆపేసిందో అప్పటినుండి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తోంది. అంతెందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కాబట్టి.. కొద్దికాలంగా విష్ణుప్రియ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు చూస్తే.. మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం విష్ణుప్రియ థాయిలాండ్ వెకేషన్ లో మరో బ్యూటీ రీతూ చౌదరితో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
థాయిలాండ్ బీచ్ లో రీతూ, విష్ణుప్రియ ఇద్దరూ ఓవైపు నేచర్ ని ఆస్వాదిస్తూనే.. షార్ట్ నిక్కర్, బీచ్ వేర్ కాస్ట్యూమ్స్ లో అందాలను కెమెరా ముందు పరిచేస్తున్నారు. ఓ రకంగా నెటిజన్స్, ఫ్యాన్స్ కూడా వీరిద్దరి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. థాయిలాండ్ లోని క్రాబి బీచ్ లో విష్ణుప్రియ, రీతూ హాట్ థైస్, నడుము అందాలతో ఫ్యాన్స్ కి మతులు పోగొడుతున్నారు. పైగా వైట్ ట్రాన్స్ పెరెంట్ షర్ట్ ధరించి.. తడిసిన అందాలను చూపుతూ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించి కొన్ని హాట్ ఫోటోలు, వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
వీరి గ్లామర్ ట్రీట్ కి కుర్రకారు ఫిదా అవుతూ.. క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక వీరి కెరీర్ విషయానికి వస్తే.. పోవే పోరా షో ద్వారా యాంకరింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. పలు పాపులర్ టీవీ షోలలో మెరిసి కొద్దికాలంలోనే మోడలింగ్, సినిమాలవైపు అడుగులేసింది. చెక్ మేట్, వాంటెడ్ పండుగాడ్ లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. మరోవైపు రీతూ చౌదరి సీరియల్ నటిగా బిజీ అయ్యింది. పలు సీరియల్స్ తో గుర్తింపు సొంతం చేసుకొని.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ మధ్య కాబోయేవాడిని కూడా పరిచయం చేసి సర్ప్రైజ్ చేసింది. మరి విష్ణుప్రియ, రీతూల థాయిలాండ్ వెకేషన్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.