సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకునే సంఘటనల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆశపడతారు. ఇక సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రిటీలకు వారధిగా నిలుస్తోంది. అయితే అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా యాంకర్ శ్యామలకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే బిగ్ బాస్ తర్వాత శ్యామల క్రేజ్ మరింత పెరిగింది. హౌస్‌లో తన ప్రవర్తనతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సంపాదించుకుంది శ్యామల. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది శ్యామల. దానిలో తన కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల వీడియోలు పోస్ట్ చేస్తూఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఫోటో షూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక తాజాగా శ్యామల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇంతకు ఏంటా ఫొటోలు అంటే..
యాంకర్ శ్యామల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాము కట్టబోయే ఇంటికి భూమి పూజ చేస్తున్నాం అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది శ్యామల. భర్త, కుమారుడితో కలిసి భూమి పూజ నిర్వహిస్తోంది. వీటిని చూసిన నెటిజనులు కొందరు.. ఆమెకు కంగ్రాట్స్ చెప్పగా.. చాలా మంది మాత్రం.. మొన్ననే కదా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశావ్.. అప్పుడే మరో ఇంటి నిర్మాణం స్టార్ట్ చేశావ్.. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ప్రస్తుతం నువ్వు పెద్దగా షోలు చేయడం లేదు, యాంకరింగ్ కూడా లేదు కదా.. మరి అప్పుడే రెండో ఇల్లు నిర్మాణం ఎలా ప్రారంభించారు.. మీ వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్స్ చేశారు.
శ్యామల గత ఏడాది జూలైలోనే కొత్త ఇల్లు కట్టుకుంది. అప్పుడు ఆ ఇంటికి సంబంధించిన విశేషాలను వీడియో, ఫొటోల రూపంలో యూట్యూబ్, ఇన్ స్టాలో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి ప్రవేశించిన సందర్భంగా అభిమానులు ఆమెకి అభినందనలు తెలిపారు. పట్టుమని ఏడాది కూడా తిరక్కముందే మరో ఇంటి నిర్మాణం చేపడుతున్నా అనే వార్త షేర్ చేయడంతో.. నెటిజనులు ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల ఇళ్లు అంటే మాములుగా ఉండవు.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తారు. మరి మీకు ఇంత సంపాదన ఎలా వస్తుంది అంటూ కొందరు నెటిజనులు కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది.
శ్యామల ప్రస్తుతం బుల్లి తెరతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెప్పిస్తోంది. పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఆమె రీసెంట్‌గా రామ్ చరణ్‌కు సపోర్ట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ప్రపంచం అంతా రామ్ చరణ్‌ను అప్రిషియేట్ చేస్తుంటే సినిమా కులం మాత్రం ఈర్ష్యతో పట్ఙంచుకోవటం లేదంటూ చేసిన ట్వీట్ వైరలవ్వడమే కాక పెను దుమారం రేపింది. దీనిపై కొందరు ఈ అవార్డ్ కేవలం రామ్ చరణ్‌కి మాత్రమే రాలేదంటూ ఆమెకు రీట్వీట్స్ కూడా చేశారు. ఇక తాజాగా మరోసారి శ్యామల చేసిన పోస్ట్ వైరలవుతోంది.